Apr 21 2021 @ 00:42AM

పాటల రికార్డింగ్‌లో...

శివ కంఠమనేని, ప్రియా హెగ్డే జంటగా రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మణిశంకర్‌’. ఇటీవలే పూజా కార్యక్రమాలతో సినిమా పాటల రికార్డింగ్‌ మొదలైంది. ‘‘ఆసక్తికరమైన కథనంతో రూపొందుతోన్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. ప్రముఖ హీరో అతిథి పాత్రలో నటించనున్నారు. త్వరలో ఆయన పేరు వెల్లడిస్తాం’’ అని చిత్రదర్శకుడు జి. వెంకటకృష్ణన్‌ (జీవీకే) చెప్పారు. కథ విన్నాక హిట్‌ సినిమా చేస్తున్నాననే ఫీలింగ్‌ కలిగిందన్నారు శివ కంఠమనేని. ‘‘జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించి, ఆగస్టుకు పూర్తి చేస్తాం. దసరాకు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని నిర్మాతలు కె.ఎస్‌. శంకర్రావు, ఏవీఎస్‌ శ్రీనివాస్‌, ఫణిభూషణ్‌ తెలిపారు.