ఒంటిపై మంటలతో పరుగెత్తుకుంటూ వచ్చిన సాధువు.. అతి కష్టం మీద అర్పేసిన పోలీసులు.. ఇంతకీ వారి ఆందోళనకు కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-21T00:36:00+05:30 IST

సాధువులంతా కలిసి ఒకే సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఓ పెద్దాయన టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. ఆయనకు మద్దతుగా వందలాది మంది నిరసన తెలియజేస్తున్నారు...

ఒంటిపై మంటలతో పరుగెత్తుకుంటూ వచ్చిన సాధువు.. అతి కష్టం మీద అర్పేసిన పోలీసులు.. ఇంతకీ వారి ఆందోళనకు కారణం ఏంటంటే..

సాధువులంతా కలిసి ఒకే సమస్యపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఓ పెద్దాయన టవర్ ఎక్కి ఆందోళన చేస్తున్నాడు. ఆయనకు మద్దతుగా వందలాది మంది నిరసన తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ సాధువు ఒంటిపై మంటలతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో ఒక్కసారిగా షాకైన పోలీసులు.. అతి కష్టం మీద మంటలను ఆర్పేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఇంతకీ ఈ సాధువుల ఆందోళనకు కారణమేంటంటే..


రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లోని పసోపా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా 551 రోజులుగా సాధువులు ఆందోళన చేస్తున్నారు. బాబా నారాయణ్ దాస్ అనే వ్యక్తి మంగళవారం ఉదయం టవర్ ఎక్కారు. రాత్రంతా టవర్ పైనే గడిపాడు. బుధవారం సాధువులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. అక్రమ మైనింగ్‌ను నిలిపేయాలంటూ నినాదాలు చేశారు. సమాచారం అందడంతో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.  అయితే ఇంతలో విజయ్ దాస్ అనే సాధువు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో వీపుపై మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. తర్వాత రాధే.. రాధే.. అంటూ జన సమూహం వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

ఓ కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తికి కోర్టులోనే ఊహించని అనుభవం.. బ్యాగులోంచి ఆ ఖైదీ చపాతీలు తీసి..


అతన్ని గమనించిన పోలీసులు.. పరుగెత్తుకుంటూ వచ్చి, అతి కష్టం మీద మంటలను ఆర్పేశారు. తర్వాత చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. 80శాతం శరీరం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై గనుల శాఖ మంత్రి ప్రమోద్ జైన్ భాయా స్పందించారు. మైనింగ్ చట్టబద్ధంగానే జరుగుతోందని తెలిపారు. ఇదిలావుండగా, సాధువు ఆత్మహత్యాయత్నంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.

మహిళపై అనుమానం రావడంతో తలుపులు బద్దలు కొట్టిన స్థానికులు.. బెడ్‌ రూమ్‌లో మంచం కింద తనిఖీ చేయగా.. షాకింగ్ సీన్..



Updated Date - 2022-07-21T00:36:00+05:30 IST