Oct 20 2021 @ 03:52AM

22 నుంచి పూణేలో?

రామ్‌చరణ్‌, దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందని టాలీవుడ్‌ సమాచారం. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రం షూటింగ్‌  ప్రారంభించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఈ శుక్రవారం నుంచి పూణేలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనున్నారు. ఏకధాటిగా 20 రోజుల పాటు జరిగే తొలి షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌, హీరోయిన్‌ కియారా అద్వాణీపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించనున్నారు. హీరోగా రామ్‌చరణ్‌కు ఇది 15వ చిత్రం. దిల్‌రాజుకు నిర్మాతగా 50వ చిత్రం. దర్శకుడు శంకర్‌కి తొలి తెలుగు స్ట్రెయిట్‌ చిత్రం. ఈ చిత్రంలో సునీల్‌, జయరామ్‌, శ్రీకాంత్‌, అంజలి కీలకపాత్రలు పోషిస్తున్నారు.