వణుకుపుట్టిస్తున్న కొత్త చట్టం.. ఉద్యోగులు ఇళ్లలో ఉన్నప్పుడు ఫోన్ చేసే బాస్‌లకు షాక్ తప్పదు..!

ABN , First Publish Date - 2021-11-15T03:33:58+05:30 IST

ఇళ్లల్లో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఆఫీస్ నుంచి బాస్ కాల్ చేస్తుంటాడు. ఏదో అర్జెంట్ అవసరం ఉండటంతో ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఎర్పడుతుంది. అయితే.. ఇకపై ఇదంతా కుదరదని పోర్చుగల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది.

వణుకుపుట్టిస్తున్న కొత్త చట్టం.. ఉద్యోగులు ఇళ్లలో ఉన్నప్పుడు ఫోన్ చేసే బాస్‌లకు షాక్ తప్పదు..!

ఇంటర్నెట్ డెస్క్: ఇళ్లల్లో ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి ఆఫీస్ నుంచి బాస్ కాల్ చేస్తుంటాడు. ఏదో అర్జెంట్ అవసరం ఉండటంతో ఫోన్ చేయాల్సిన పరిస్థితి ఎర్పడుతుంది. అయితే.. ఇకపై ఇదంతా కుదరదని పోర్చుగల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటీవల దేశంలో ఓ కొత్త చట్టాన్ని ప్రవేశ పెట్టింది. దీని ప్రకారం.. ఉద్యోగులు ఇంటికెళ్లిపోయాక కూడా బాస్‌లు వారికి ఫోన్ చేస్తే అది ఉద్యోగుల ప్రవైసీకి భగ్నం కలిగించడమే! కొత్త చట్టం ప్రకారం.. ఇటువంటివి చేయడం చాలా తీవ్రమైన నేరం. ఇటువంటి బాస్‌లపై భారీ జరిమానాలు విధిస్తామని కూడా పోర్చుగల్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫోన్‌లోనే కాదు.. ఈ మెయిల్ చేయడం లేదా మెసేజీలు పెట్టడం కూడా ఈ చట్టం కింద నిషిద్ధం. ప్రస్తుతం అక్కడి ఉద్యోగులు ఈ కొత్త చట్టంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఫ్రాన్స్ ప్రభుత్వం 2017లోనే ఇటువంటి ఓ చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం..  ఇంట్లో ఉన్నప్పుడు బాస్‌లు ఫోన్ చేసినా ఉద్యోగులు పట్టించుకోనక్కర్లేదు. ఈ విషయంలో యజమానులు కూడా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకూడదు. 

Updated Date - 2021-11-15T03:33:58+05:30 IST