Jul 7 2021 @ 01:02AM

రాజకీయాల్లోకా..నేనా?

‘రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకోవడం లేదు’ అని నటుడు జగపతిబాబు తన అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. తెలుపుకుర్తా, పైజామా... చేతిలో నల్ల కళ్లాద్దాలు పట్టుకొని గోడపైన కూర్చొని ఉన్న స్టిల్‌ను ఆయన మంగళవారం ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా వైరలయింది. దాంతో ‘త్వరలో పాలిటిక్స్‌లోకి అడుగుపెడుతున్నారా?’ అనే సందేహాన్ని అభిమానులు వ్యక్తం చేయడంతో ఆయన ‘రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవడం లేదు’ అని బదులిచ్చారు. ప్రస్తుతం ఆయన ‘మహాసముద్రం’, ‘రిపబ్లిక్‌’, ‘టక్‌ జగదీష్‌’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు.