రాజకీయాల్లో సవాళ్లను అంగీకరించాలి: బీజేపీ అభ్యర్థిగా మారిన గవర్నర్‌ బేబీరాణి మౌర్యా

ABN , First Publish Date - 2022-02-10T15:20:44+05:30 IST

బీజేపీ అభ్యర్థిగా మారిన గవర్నర్‌ బేబీరాణి మౌర్యా గురువారం ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు....

రాజకీయాల్లో సవాళ్లను అంగీకరించాలి: బీజేపీ అభ్యర్థిగా మారిన గవర్నర్‌ బేబీరాణి మౌర్యా

ఆగ్రా(ఉత్తరప్రదేశ్):బీజేపీ అభ్యర్థిగా మారిన గవర్నర్‌ బేబీరాణి మౌర్యా గురువారం ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.ఈ ఎన్నికల్లో బీజేపీకి మాత్రమే అభివృద్ధి ఎజెండా ఉందని బేబిరాణి మౌర్యా చెప్పారు. రాజకీయాల్లో సవాళ్లను ప్రజలు స్వీకరించాలని ఆమె పేర్కొన్నారు.ఆగ్రాలోని మొత్తం తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని ఆగ్రా రూరల్ సీటు అభ్యర్థి బేబీ రాణి మౌర్య చెప్పారు.‘‘నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గతసారి ఆగ్రాలోని మొత్తం 9 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈసారి కూడా మేం తొమ్మిదికి తొమ్మిది స్థానాలను గెలుచుకుంటాం’’ అని మౌర్య జోస్యం చెప్పారు.పశ్చిమ యూపీలోని 58 స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలోని 58 సీట్లలో 91 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంది.


 వ్యవసాయ చట్టాలపై నిరసనల నేపథ్యంలో రైతుల ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. బీజేపీ  కుల వివక్షను వ్యాప్తి చేస్తోందని, మహిళలు, దళితుల సంక్షేమానికి కృషి చేయడం లేదని గత వారం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆరోపించారు.మాయావతి ఆరోపణలను బేబీ రాణి మౌర్య కొట్టిపారేశారు. ఎల్లప్పుడూ మహిళలకు అధికారం ఇచ్చే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు.‘‘మాయావతిని యూపీ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ సాయపడింది. బీజేపీ నన్ను ఉత్తరాఖండ్ గవర్నర్‌గా చేసింది. మహిళల సంక్షేమం కోసం బీజేపీ చేసినంతగా ఎవరూ పని చేయలేదు’’ అని మౌర్య అన్నారు.


Updated Date - 2022-02-10T15:20:44+05:30 IST