Abn logo
Sep 17 2021 @ 23:07PM

ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కౌంటింగ్‌ కేంద్రంలో ఆర్డీవోతో మాట్లాడుతున్న ఎస్పీ విజయరావు

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట చర్యలు 

 ఎస్పీ విజయరావు 

నాయుడుపేట/టౌన్‌, సెప్టెంబరు 19 : ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపును నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ విజయరావు తెలిపారు.  స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 19న నాయుడుపేట రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని మూడు మండలాల ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు జరగనంది.  ఎస్పీ విజయరావు, నాయుడుపేట ఆర్డీవో సరోజిని శుక్రవారం కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఓట్ల లెక్కింపు సమయంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద విద్యుత్‌, తాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పాటు కొవిడ్‌ కిట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు.  ఆర్డీవో సరోజిని మాట్లాడుతూ నాయుడుపేట మండలంలో నాలుగు, ఓజిలి మండలంలో నాలుగు, తడ మండలం ఆరు  ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ఠాణాలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

ఎస్పీ విజయరావు నాయుడుపేట ఠాణాను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రమాదాలు, చోరీలలో రివకరీ చేసిన వాహనాలను పరిశీలించారు. రిసెప్షన్‌ సెంటర్‌లో ఫిర్యాదుదారులకు కల్పించిన వసతులను పరిశీలించి పోలీసులకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. అనంతరం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో క్రైమ్‌ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ వెంట సీఐలు వైవీ సోమయ్య, గూడూరు టౌన్‌ సీఐ నాగేశ్వరమ్మ, రూరల్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్‌ఐలు చింతం కృష్ణారెడ్డి, మనోజ్‌కుమార్‌, తిరుమలరావు, నాయుడుపేట తహశీల్దార్‌ శ్రీనివాసులు, ఆర్‌వోలు ఏడుకొండలు, శివారెడ్డి, ఎంపీడీవోలు శివప్రసాద్‌, రమణయ్య ఉన్నారు.