పంచాయతీరాజ్‌లో.. అభివృద్ధి అధికారులు

ABN , First Publish Date - 2020-10-23T10:09:56+05:30 IST

పంచాయతీరాజ్‌లో రెవెన్యూ డివిజనల్‌ అభివృద్ధి అధికారుల వ్యవస్థ ప్రారంభమైంది. రెవెన్యూలో ఆర్డీవోల తరహాలో పంచాయతీరాజ్‌లో ..

పంచాయతీరాజ్‌లో.. అభివృద్ధి అధికారులు

 నాలుగు డివిజన్లకు డీఎల్‌డీవోల నియామకం

జడ్పీ సీఈవోకు, ఎంపీడీవోలకు మధ్య అనుసంధానం

సీనియర్‌ ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతులపై హర్షం


(ఆంధ్రజ్యోతి - గుంటూరు):పంచాయతీరాజ్‌లో రెవెన్యూ డివిజనల్‌ అభివృద్ధి అధికారుల వ్యవస్థ ప్రారంభమైంది. రెవెన్యూలో ఆర్డీవోల తరహాలో పంచాయతీరాజ్‌లో డివిజనల్‌ లెవల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌(డీఎల్‌డీవో) పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో నాలుగు డివిజన్లకు నలుగురు అభివృద్ధి అధికారులను నియమిస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా పరిషత్‌ సీఈవోకు మండల పరిషత్‌ అధికారుల(ఎంపీడీవో) మధ్య డీఎల్‌డీవోలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తారు. సీనియర్‌ ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతులు కల్పిస్తూ వారిని డీఎల్‌డీవోలుగా నియమించారు. దీర్ఘకాలంగా ఉద్యోగోన్నతులు లేవని.. ఎంపీడీవోలు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో వారి డిమాండ్‌ మేరకు డీఎల్‌డీవో పోస్టులు సృష్టించారు. దీంతో ఇక నుంచి ఎంపీడీవో - డీఎల్‌డీవో - జడ్పీ సీఈవో విధానం అమల్లోకి వస్తుంది. ఎంపీడీవోలకు ఉద్యోగోన్నతులు కల్పించటంపై అసోసియేషన్‌ రాష్ట్ర నేతలు శ్రీనివాసరెడి ్డ, బ్రహ్మయ్య, నాయక్‌, జోసఫ్‌కుమార్‌ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 


మంగళగిరిలో ఎంపీడీవో ఎస్‌ రాజేష్‌ను ఉద్యోగన్నతి కల్పించి గుంటూరు డీఎల్‌డీవోగా నియమించారు. 

రొంపిచర్ల ఎంపీడీవో డాక్టర్‌ అర్జునరావును నరసరావుపేట డీఎల్‌డీవోగా బదిలీ చేశారు. 

నూజెండ్ల ఎంపీడీవో ఎం వెంకటరెడ్డికి గురజాల డీఎల్‌డీవోగా ఉద్యోగోన్నతి కల్పించారు. 

పెదకూరపాడు ఎంపీడీవో ఏ సుధాకర్‌కు ఉద్యోగోన్నతి కల్పించి తెనాలి డీఎల్‌డీవోగా బదిలీ చేశారు. 

Updated Date - 2020-10-23T10:09:56+05:30 IST