క్రమశిక్షణ అలవడాలంటే...

ABN , First Publish Date - 2022-06-27T05:47:49+05:30 IST

పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మావల్ల కావడం లేదని, పిల్లలు మాట వినడం లేదని అంటుంటారు...

క్రమశిక్షణ అలవడాలంటే...

పిల్లలను క్రమశిక్షణలో పెట్టాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ మావల్ల కావడం లేదని, పిల్లలు మాట వినడం లేదని అంటుంటారు. అయితే పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇబ్బందులు ఉండవని అంటున్నారు నిపుణులు. వారు సూచిస్తున్న సలహాలు ఇవి...


పిల్లలతో మాట్లాడటం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. వాళ్లను అర్థం చేసుకోవడానికి ఇది మంచి మార్గం. అంతేకాకుండా పిల్లలు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని సంతోషిస్తారు.

సరైన ఆధారాలు లేకుండా నువ్వు చేసింది తప్పు అని పిల్లలను అనకూడదు. 

పిల్లలు వాళ్ల సమస్యల గురించి చెబుతున్నప్పుడు ఓపికగా వినాలి. వాళ్ల సమస్యలు తీర్చేందుకు తప్పక ప్రయత్నిస్తాననే భరోసాను కల్పించాలి. 

నిబంధనలు పెట్టినంత మాత్రాన స్ట్రిక్ట్‌గా మాట్లాడకూడదు. ఆప్యాయంగా చెప్పాలి. అదే సమయంలో రూల్స్‌ పెట్టింది పాటించడానికే అన్న విషయం అర్థమయ్యేలా చూడాలి.

మీరు పెట్టిన నిబంధనలను పాటించినప్పుడు అభినందించడం, బహుమతులు ఇవ్వాలి. 

పేరెంట్స్‌గా పిల్లల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. వాళ్లను ఒత్తిడికి గురిచేస్తున్న అంశాలను గుర్తించాలి. అవి తొలగిపోయేలా పిల్లలకు సహాయం అందించాలి. 

Updated Date - 2022-06-27T05:47:49+05:30 IST