అగ్రరాజ్యం ఆర్థిక రాజధానిలో ఆకలి కేకలు..!

ABN , First Publish Date - 2020-05-22T23:10:07+05:30 IST

అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌ సిటీలో ప్రస్తుతం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కనీసం ఒక్కపూట కూడా తినడానికి తిండి దొరకని పేద ప్రజల సంఖ్య అక్కడ ఎక్కువైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం

అగ్రరాజ్యం ఆర్థిక రాజధానిలో ఆకలి కేకలు..!

న్యూయార్క్: అమెరికా ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌ సిటీలో ప్రస్తుతం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కనీసం ఒక్కపూట కూడా తినడానికి తిండి దొరకని పేద ప్రజల సంఖ్య అక్కడ ఎక్కువైంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. కనిపించని శత్రువుతో చేసే పోరులో.. ప్రపంచమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం కూడ లాక్‌డౌన్ బాటపట్టడంతో.. ఆ దేశంలోని వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. దీంతో కోట్లాది మంది ప్రజలు ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలోనే అగ్రరాజ్యానికి ఆర్థిక రాజధానిగా భావించే న్యూయార్క్‌లో ప్రస్తుతం ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. కనీసం ఒక్కపూట కూడా తినడానికి తిండి దొరకని పేద ప్రజల సంఖ్య.. కరోనా కారణంగా ఎక్కువైందని న్యూయార్క్ నగర మేయర్.. మీడియా సమావేశంలో వెల్లడించారు. గతంలో న్యూయార్క్‌లో పేద ప్రజల సంఖ్య 10లక్షలు ఉండగా.. కరోనా కారణంగా అది రెట్టింపు అయిందన్నారు. కాగా.. వచ్చే వారం నుంచి పేద ప్రజల కోసం నగరంలో ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 16.21లక్షల మంది కరోనా బారినపడగా.. అందులో ఒక్క న్యూయార్క్‌కు చెందిన వారే 3.66లక్షల మంది ఉన్నారు. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య న్యూయార్క్‌లో 28వేలు దాటింది. అమెరికాలో వ్యాప్తంగా 96వేల మందికి పైగా మరణించారు. 


Updated Date - 2020-05-22T23:10:07+05:30 IST