NRI మహిళకు చేదు అనుభవం.. America నుంచి ఇండియాకు వస్తుండగా విమానంలో ఓ డాక్టర్ చేసిన పనికి ఆమె షాక్!

ABN , First Publish Date - 2022-06-22T20:57:23+05:30 IST

అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న ఎన్నారై మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మహిళ ప్రయాణిస్తున్న విమానం దుబాయ్ చేరుకున్న తర్వాత.. ఆమె వెనకాల కూర్చున్న ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలకు ఒక్కసారిగా కంగుతిన్న సదరు

NRI మహిళకు చేదు అనుభవం.. America నుంచి ఇండియాకు వస్తుండగా విమానంలో ఓ డాక్టర్ చేసిన పనికి ఆమె షాక్!

ఎన్నారై డెస్క్: అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తున్న ఎన్నారై మహిళకు చేదు అనుభవం ఎదురైంది. మహిళ ప్రయాణిస్తున్న విమానం దుబాయ్ చేరుకున్న తర్వాత.. ఆమె వెనకాల కూర్చున్న ఓ డాక్టర్ అసభ్యంగా ప్రవర్తించాడు. అతడి చేష్టలకు ఒక్కసారిగా కంగుతిన్న సదరు మహిళ విమానం సిబ్బందికి సమాచారం అందించింది. ఆ తర్వాత ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 


అమెరికాలో నివాసం ఉంటున్న ఓ ఎన్నారై మహిళ.. తమిళనాడుకు బయల్దేరింది. ఆమె ప్రయాణం చేస్తున్న విమానం ఇండియాకు వచ్చే క్రమంలో దుబాయ్‌ని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయింది. అనంతరం దుబాయ్‌లో కొంత మంది ప్యాసింజర్‌లు ఆ విమానంలోకి ఎక్కారు. ఈ నేపథ్యంలోనే ఫ్లైట్ ఎక్కిన చెన్నైకి చెందిన ఓ డాక్టర్.. ఎన్నారై మహిళ వెనక సీట్లో కూర్చున్నాడు. ఫ్లైట్ ఇండియాకు బయల్దేరిన తర్వాత.. సదరు డాక్టర్ వెనకాల నుంచి ఎన్నారై మహిళపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. వెంటనే విమాన సిబ్బందికి కంప్లైట్ చేసింది. ఈ క్రమంలో క్రూ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించారు. 



దీంతో విమానం తమిళనాడులో ల్యాండ్ అయిన వెంటనే.. అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నారై మహిళ నుంచి ఎటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు అతడిని విడిచిపెట్టారు. పోలీసులు వైద్యుడిని విడిచిపెట్టిన అనంతరం.. కేసు విషయమై సదరు మహిళ పోలీసులను సంప్రదించి అతడిపై ఫిర్యాదు చేసింది. కాగా.. ఈ ఘటన మార్గ మధ్యలో జరిగిన కారణంగా ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే.. ఎన్నారై మహిళ, చెన్నెైకి చెందిన డాక్టర్‌కు సంబంధించిన వివరాలను మాత్రం పోలీసులు బయటపెట్టలేదు.


Updated Date - 2022-06-22T20:57:23+05:30 IST