అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణ, స్ర్కీన్‌ప్లే, సమర్పణలో రూపొందుతున్న సినిమా ‘గాలి సంపత్’. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుంది. అనిల్ రావిపూడి స్నేహితుడు ఎస్. కృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు కథానాయకుడు. రాజేంద్రప్రసాద్ టైటిల్ పాత్రధారి. ‘‘ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. ఆదివారం డబ్బింగ్ ప్రారంభించాం’’ అని నిర్మాత చెప్పారు. ‘‘శివరాత్రికి మీ అభిమాన థియేటర్లలో మీ సమక్షంలో నేను, మా నాన్న కలవబోతున్నాం’’ అని శ్రీవిష్ణు అన్నారు. ‘‘అందర్నీ అలరించే వెరైటీ చిత్రమిది’’ అని అనిల్ రావిపూడి తెలిపారు. ‘‘నేను ఎన్నో చిత్రాలు చేశా. కానీ, గాలి సంపత్ పాత్ర వైవిధ్యమైనది, కొత్తది. ఈ చిత్రంలో వినోదంతో పాటు హృదయాలను హత్తుకునే భావోద్వేగాలున్నాయి’’ అని రాజేంద్రప్రసాద్ చెప్పారు. లవ్లీ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ‘మిర్చి’ కిరణ్, సంగీతం: అచ్చు రాజమణి, దర్శకత్వం: అనీష్.