Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 29 Mar 2022 17:01:35 IST

ఈ ఎస్‌ఐ మరీ ఇంత శాడిస్టా.. ఉద్యోగం పేరుతో యువకుడిని 6నెలల పాటు ఒకే గదిలో ఉంచి మరీ..

twitter-iconwatsapp-iconfb-icon
ఈ ఎస్‌ఐ మరీ ఇంత శాడిస్టా.. ఉద్యోగం పేరుతో యువకుడిని 6నెలల పాటు ఒకే గదిలో ఉంచి మరీ..ప్రతీకాత్మక చిత్రం

ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే తపనతో కొందరు ఎవరిని పడితే వారిని నమ్మి.. చివరికి మోసపోతుంటారు. కొందరైతే నిరుద్యోగుల నుంచి లక్షల రూపాయలు దండుకుని మరీ చివరికి మొండి చేయి చూపిస్తుంటారు. ఇక యువతుల విషయంలో అయితే మరీ దారుణంగా ప్రవర్తిస్తుంటారు. వారి బలహీనతను అవకాశంగా తీసుకుని, ఏవేవో మాయ మాటలు చెప్పి చివరికి వారి జీవితాలను సర్వ నాశనం చేస్తుంటారు. మధ్యప్రదేశ్‌లో ఇటీవల విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ యువకుడిని, ఎస్‌ఐ.. ఆరు నెలల పాటు ఓ గదిలో ఉంచాడు. అతడు చేసిన పని తెలుసుకుని చివరికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ రాష్ట్రం ‌గ్వాలియర్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. ఉద్యోగం కోసం కొన్నేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అతడి ప్రయత్నాలు మాత్రం ఫలించలేదు. తీవ్ర నిరాశలో ఉన్న అతడు 2021లో అతడి స్నేహితుడైన రాజ్‌కుమార్ అనే వ్యక్తికి తన బాధను తెలియజేశాడు. దీంతో అతడు సురేంద్ర అనే ఇన్​స్పెక్టర్‌ని పరిచయం చేశాడు. అప్పటి నుంచి ఉద్యోగం ఇప్పించమని ఆ యువకుడు తరచూ ఇన్​స్పెక్టర్‌కి ఫోన్ చేస్తుండేవాడు. ఓ రోజు ఆ యువకుడికి ఇన్​స్పెక్టర్‌ ఫోన్ చేసి, తాను చెప్పిన చోటుకు రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన యువకుడిని ఓ గదికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఏకంగా ఆరు నెలల పాటు యువకుడిని గదిలోనే బంధించి లైంగికంగా చిత్రహింసలు పెట్టేవాడు.

భర్త మెసేజ్ చేయడంతో న్యూడ్ ఫొటోలు పంపిన భార్య.. కొన్నాళ్లకు అనుమానం వచ్చి ఆరాతీయగా..

బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఆ యువకుడు అలాగే భరిస్తూ వచ్చాడు. అయితే రోజురోజుకూ వేధింపులు ఎక్కువ అవడంతో తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా బయటపడాలని వివిధ రకాలుగా ఆలోచించాడు. ఓ రోజు తన స్నేహితుడికి విషయం చెప్పి.. ఇన్​స్పెక్టర్‌ నగ్నంగా ఉన్న సమయంలో వీడియో తీయించాడు. తర్వాత అక్కడి నుంచి బయటపడి.. ఆ వీడియో ఆధారంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న సురేంద్ర కోసం గాలిస్తున్నారు.

మేడమ్! ఆటోలో పెట్రోల్ అయిపోయింది.. పట్టుకొస్తానంటూ వెళ్లాడు.. తర్వాత స్నేహితుడితో కలిసి వచ్చి..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

‘‘సమాజానికి భయపడకు.. మన ప్రేమ గురించి అందరికీ చెప్పు’’.. అంటూ వరుడి ముందే వధువుకు ధైర్యం చెప్పిన యువకుడు.. తర్వాత..videoఎంతసేపు టీవీ చూస్తావ్! బయటికి రా.. అంటూ పిలిచిన భార్య.. ఎంతసేపటికీ రాలేదని ఇంట్లోకి వెళ్లి..అర్ధరాత్రి ఒంటరిగా వెళ్తున్న తల్లీకొడుకును అడ్డుకున్న వ్యక్తులు.. అరిస్తే చంపేస్తామంటూ బెదిరించి.. చివరకు..అన్నాదమ్ములిద్దరికీ పెళ్లి ఫిక్స్.. పెళ్లి రోజు బంధువులతో సహా వధువుల ఇంటికి.. తీరా అక్కడ సీన్ చూసి..‘‘మీ నాన్న నాకు చాలా క్లోజ్’’.. అంటూ పరిచయం చేసుకున్నాడు.. పనుందంటూ బాలికను పాఠశాల వాష్‌రూమ్‌లోకి తీసుకెళ్లి..ఆడుకుని వస్తానంటూ వెళ్లి.. ఇంటికి రాని విద్యార్థి, అదే రోజు టీచర్ కూడా అదృశ్యం.. ఆరాతీయగా చివరికి తెలిసింది ఏంటంటే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.