రెండు ఆడ పులుల మధ్య ఫైట్.. మధ్యలో కలగజేసుకున్న చిరుత.. చివరికి దానికి ఏ గతి పట్టిందంటే..

ABN , First Publish Date - 2022-02-27T22:48:46+05:30 IST

రెండు ఆడ పులుల మధ్య భీకర పోరు జరుగుతున్న దృశ్యాలను దూరం నుంచి ఓ చిరుత గమనించింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకుంది. ఫైట్ మధ్యలో కలుగజేసుకునేందుకు ప్రయత్నించింది. ఫలి

రెండు ఆడ పులుల మధ్య ఫైట్.. మధ్యలో కలగజేసుకున్న చిరుత.. చివరికి దానికి ఏ గతి పట్టిందంటే..

ఇంటర్నెట్ డెస్క్: రెండు ఆడ పులుల మధ్య భీకర పోరు జరుగుతున్న దృశ్యాలను దూరం నుంచి ఓ చిరుత గమనించింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకుంది. ఫైట్ మధ్యలో కలుగజేసుకునేందుకు ప్రయత్నించింది. ఫలితంగా ఏడు గంటలపాటు ఓ చెట్టుపై బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..



మధ్యప్రదేశ్‌లోని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్‌లో తాజాగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయాన్నే రెండు ఆడ పులులు గొడవకు దిగాయి. ఈ క్రమంలో బలహీనంగా ఉన్న పులిపై బలంగా ఉన్న పులి దాడికి దిగింది. ఆ దృశ్యాలు దూరంగా ఉన్న చిరుత కంట పడ్డాయి. దీంతో అది హుటాహుటిన అక్కడకు చేరుకుంది. బలహీనంగా ఉన్న పులి తరఫున ఫైట్ చేసేందుకు సిద్ధ పడింది. అయితే.. తమ గొడవలో చిరుత కలగజేసుకోవడం మరో పులికి నచ్చలేదు. దీంతో అది గట్టిగా గర్జిస్తూ చిరుతపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చిరుత ఒక్కసారిగా భయాందోళనలకు గరై అక్కడ నుంచి పరుగు తీసింది. చిరుత భయంతో పారిపోతున్నప్పటికీ ఆ పులి దాన్ని వదిలి పెట్టలేదు. చిరుత వెనకాలే పరుగులు పెట్టింది. ఈ క్రమంలో చేసేదేమీ లేక తనను తాను రక్షించుకునేందుకు చిరుత.. దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కేసింది. పులి అక్కడ నుంచి వెళ్లే వరకూ సుమారూ ఏడు గంటలపాటు చిరుత బిక్కుబిక్కుమంటూ చెట్టుపైనే గడిపింది. ఈ విషయాన్ని బాంధవ్‌ఘర్ టైగర్ రిజర్వ్ ప్రతినిధులు శనివారం వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశం అయింది.



Updated Date - 2022-02-27T22:48:46+05:30 IST