Haryana: భార్య కోసం అత్తగారింటికి వెళ్లిన భర్త.. అక్కడ అతనికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-07-25T01:53:28+05:30 IST

అతనికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది.. మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది..

Haryana: భార్య కోసం అత్తగారింటికి వెళ్లిన భర్త.. అక్కడ అతనికి ఎదురైన షాకింగ్ అనుభవం ఏంటంటే..

అతనికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది.. మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.. భార్యను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు భర్త ఆమె దగ్గరకు వెళ్లాడు.. అక్కడ అతనికి షాకింగ్ అనుభవం ఎదురైంది.. అత్తగారి ప్రోద్భలంతో మామ, బావమరిది ఆ వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.. పదునైన ఆయుధంతో పొట్టలో పొడిచారు.. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నాడు.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. హర్యానా (Haryana)లోని సోనెపట్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.  


ఇది కూడా చదవండి..

US Job Offer: నాగ్‌పూర్ కుర్రాడికి అమెరికా సంస్థ నుంచి బంపరాఫర్‌, భారీ ప్యాకేజ్‌తో కొలువు ఇస్తామని పిలుపు.. కానీ,..


సోనెపట్ జిల్లాలోని ప్రేమ్‌నగర్ గ్రామానికి చెందిన ప్రమోద్ అనే వ్యక్తి కొద్ది నెలల క్రితం మోహన గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ప్రమోద్ భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు శనివారం ఉదయం ప్రమోద్ అత్తింటికి వెళ్లాడు. ప్రమోద్‌ను చూసి అత్తగారు తీవ్ర ఆగ్రహానికి గురైంది. `వాడిని కొట్టండి.. మన అమ్మాయిని వేధిస్తున్నాడు.. చంపండి` అని కేకలు పెట్టింది. వెంటనే ప్రమోద్ మామ, బావమరది కర్రలు పట్టుకుని వచ్చారు. ప్రమోద్‌ను కింద పడేసి చితక్కొట్టారు. 


కొద్ది సేపటి తర్వాత బావమరిది పదునైన ఆయుధం తీసుకొచ్చి ప్రమోద్ పొట్టలో పొడిచాడు. వారి బారి నుంచి తప్పించుకున్న ప్రమోద్ స్థానిక హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. ప్రాథమిక చికిత్స అందించిన స్థానిక వైద్యులు ప్రమోద్‌ను జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్‌కు వెళ్లి ప్రమోద్ నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు.  

Updated Date - 2022-07-25T01:53:28+05:30 IST