కోజికోడ్: పెళ్లాడాలనుకున్న అమ్మాయికి బంధువులు వేరే సంబంధం చూడటంతో తట్టుకోలేని ఓ యువకుడు ఆ అమ్మాయికి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. తాను కూడా నిప్పంటించుకున్నాడు. మంటల్లో అతను కాలి మరణించగా, స్వల్ప గాయాలతో ఆమె ఆసుపత్రిలో కోలుకుంటోంది. కేరళలోని నాదపురంలో ఉన్న అమ్మాయి ఇంటి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవి కూడా చదవండి
నాదపురానికి చెందిన 42 ఏళ్ల రత్నేష్ వృత్తి రీత్యా ఎలక్ట్రీషియన్. ప్రేమించిన అమ్మాయిని పెళ్లాడాలనుకున్నాడు. అయితే ఆమె బంధువులు దీనిని వ్యతిరేకించి మరో వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం చేశారు. దీంతో రత్నేష్ తెల్లవారుజామున 2.30 గంటలకు వెళ్లి నిచ్చెన సాయంతో మొదటి అంతస్తులో ఉన్న అమ్మాయి గది వరకూ వెళ్లాడు. ఆమెకు నిప్పుపెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నం విఫలం కావడంతో తనకు తాను నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా కాలినగాయాలతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో స్వల్పగాయాల పాలైన ఆ అమ్మాయితో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ప్రస్తుతం ఆసుపత్రులో చికిత్స పొందుతున్నారు.