రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-07-27T04:23:03+05:30 IST

డప్పు కళాకారులతో పాటు, చెప్పులు కుట్టేవాళ్లు, చర్మకారులు, కాటి కాపరులకు ఐదువేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు డిమాండ్‌ చేశారు.

రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలి
గద్వాల తహసీల్దార్‌ కార్యాలయం ముందు నిరసన వ్వక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

- బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు

- తహసీల్దార్‌ కార్యాలయం ముందు చెప్పు, డప్పు కార్మికుల నిరసన

గద్వాల రూరల్‌/ గట్టు/ మల్దకల్‌/ కేటీదొడ్డి, జూలై 26 : డప్పు కళాకారులతో పాటు, చెప్పులు కుట్టేవాళ్లు, చర్మకారులు, కాటి కాపరులకు ఐదువేల రూపాయల పింఛన్‌ ఇవ్వాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ముందు సోమవారం వారు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ఎస్సీలను ఉద్ధరిస్తున్నా మంటున్న ముఖ్యమంత్రి డప్పు కళాకారులు, చెప్పుల తయారీ కార్మికులు, చర్మ కారులు, కాటి కాపరులకు పింఛన్లు ఎందుకు ఇవ్వ డం లేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో దళితుల ఓట్లకోసం పథకాలు ప్రవేశపెడుతున్న సీఎం, దీనిని కూడా అమలు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌ లక్ష్మికి వినతిపత్రం అందించారు. కార్య క్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు బండల పద్మావతి, కార్యవర్గ సభ్యుడు రాజశేఖర్‌ రెడ్డి, ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి నాగేందర్‌, యాదవ, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాము లు, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, నాయకులు నెమలికంటి రామాంజనేయులు, పసుల రామకృష్ణ, వికాస్‌ గౌడ్‌, అనిల్‌, గోపాల్‌, శ్యామ్‌, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


- బీజేపీ గట్టు మండల ఎస్పీ సెల్‌ అధ్యక్షుడు తిమ్మప్ప ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు డప్పులు వాయిస్తూ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ అహ్మద్‌ఖాన్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బల్గెర శివారెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు కొళాయి భాస్కర్‌, కార్యదర్శి రాజప్ప, హుసేనప్పు, ఏలియా, శంకర్‌, భీమేష్‌ పాల్గొన్నారు.


- మల్దకల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కిసాన్‌మోర్చా జిల్లా నాయకుడు పాలవాయి రాము లు, నాయకులు గోవిందు, మహేశ్‌, ప్రకాశ్‌, లక్ష్మన్న, చంద్రన్న, బాలు, సవారన్న, సవారన్న, ఆంజనేయులు తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.


- కేటీదొడ్డి తహసీల్దార్‌ కార్యాలయం ముందు ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు వీరేశ్‌ ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించారు. అనంతరం ఇన్‌చార్జి తహసీల్దార్‌ సుభాష్‌ నాయుడుకు వినతి పత్రం అందించారు. ధర్నాలో బీజేవైఎం మండల అధ్యక్షుడు మహాదేవ్‌, కిసాన్‌ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీపాదరెడ్డి, గుంతబాయి, శ్రీను, వీరేశ్‌ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T04:23:03+05:30 IST