Ukraine సంక్షోభాన్ని డెన్మార్క్‌లో ప్రస్తావించిన Modi

ABN , First Publish Date - 2022-05-04T01:15:09+05:30 IST

ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్..

Ukraine సంక్షోభాన్ని డెన్మార్క్‌లో ప్రస్తావించిన Modi

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల యూరప్ దేశాల పర్యటనలో భాగంగా మంగళవారంనాడు Denmarkలో ప్రస్తావించారు. ఉక్రెయిన్‌లో తక్షణం కాల్పుల విరమణ జరగాలని అభిలషించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంక్షోభానికి తెరచిందేందుకు ఈ అంశంతో ప్రమేయమున్న ప్రతి ఒక్కరూ శాంతి, దౌత్య మార్గాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. డేనిష్ ప్రధాని మెట్టె ఫ్రెడరిక్‌సెన్‌తో ద్వైపాక్షిక చర్యల అనంతరం మీడియాతో Modi మాట్లాడుతూ, ఇండియా-యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌కు సంబంధించిన సంప్రదింపులు సాధ్యమైనంత త్వరగా ముగుస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇండియాలోని ఇన్‌ఫ్రా, గ్రీన్ సెక్టార్లలో డేనిష్ సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని చెప్పారు.


డెన్మార్క్ ప్రధాని ఫ్రెడరిక్‌సెన్ మాట్లాడుతూ, రష్యాతో తనకున్న పలుకుబడిన భారత్ ఉపయోగించి ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడేలా చేయగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యుద్ధానికి తెరదించి, పౌరుల మరణాల ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్‌కు Mette Frederiksen విజ్ఞప్తి చేశారు.

Read more