Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒక్క రోజులో... $ 2.5 బిలియన్‌లు నష్టపోయిన బిట్‌కాయిన్ వ్యాపారి

న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ మార్కెట్ కుప్పకూలడంతో ఓ బిట్‌కాయిన్ వ్యాపారికి... కేవలం 24 గంటల్లో 2.5 బిలియన్ డాలర్ల మేర నష్టాన్ని మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బిట్‌కాయిన్ విలువలో అయిదవ వంతును కలోల్పోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. క్రిప్టో కరెన్పీ డేటా ప్లాట్‌ఫాం కోయింజెకో ప్రాతిపదికన 1,392 కాయిన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ 15 శాతం తగ్గి 2.34 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. కిందటి నెలలో... బిట్‌కాయిన్ రికార్డ్ స్థాయిలో 69 వేల డాలర్లకు చేరుకున్న సందర్భంలో... ఆ విలువ... మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా శనివారం క్రిప్టో కరెన్సీ మార్కెట్ 16.5  శాతం మేర క్రాష్ కావడంతో... ఓ బిట్‌కాయిన్ వ్యాపారి 2.5 బిలియన్ డాలర్లను కోల్పోవాల్సి వచ్చింది. ఆయన దగ్గర 2.88 లక్షల బిట్‌కాయిన్లున్నాయి. కాగా... బిట్‌కాయిన్ విలువ దిగజారడంతో... సదరు వ్యాపారి భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 


ఆ వ్యాపారి వద్ద శుక్రవారం 16.29 బిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్లున్నాయి. కాగా... శనివారం ఉదయానికి క్రిప్టో విలువ పతనమైంది. ఈ క్రమంలో... ఆ బిట్‌కాయిన్ల విలువ... సాయంత్రానికి 13.81 బిలియన్ డాలర్లకు పడిపోయింది(అంటే... శనివారం ఒక్కరోజే... దాని విలువలో అయిదో వంతును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో ఆ వ్యాపారి ఒక్క రోజులోనే 2.48 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిని ‘మార్కట్ క్రాష్ ప్రాఫిట్ బుకింగ్ పీరియడ్’గా విశ్లేషకులు పేర్కొంటున్నారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఇటీవల గరిష్ట స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజి అమ్మకాల విభాగం అధిపతి డి. అనెటన్... ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో... పరపతి నిష్పత్తుల పెరుగుదలతోపాటు  పెద్ద హోల్డర్లను తమ బిట్‌కాయిన్ల వాలెట్‌ల నుంచి ఎక్స్ఛేంజీలకు ెలా బదిలీ చేస్తున్నారో చూస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. 


ఒమిక్రాన్ ఆందోళన నేపధ్యంలో క్రిప్టో విలువ భారీగా పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

నంబరులో అమెరికాలో ఉద్యోగవృద్ధి మందగించడంతోపాటు కరోునా, ఒమిక్రాన్ పెట్టుబడిదారులపై ప్రభావం చూపించిందని వినవస్తోంది. సెప్టెంబరు 8 న యూఎస్ హౌస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా మరో ఎనిమిది సంస్థల ప్రకటనలకు ముందే ఈ అమ్మకాలు జరిగినట్లు వినవస్తోంది. ఇదిలా ఉంటే... కేవలం 24 గంటల్లో... 2.5 బిలియన్ డాలర్ల మేర నష్టపోయిన ఆ వ్యాపారి వివరాలు మాత్రం వెల్లడికాలేదు. 


Advertisement
Advertisement