స్త్రీ శక్తి భవనం

ABN , First Publish Date - 2021-04-22T05:51:45+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం అభివృద్ధికి శాపంగా మారుతోంది.

స్త్రీ శక్తి భవనం
నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన స్త్రీ శక్తి భవనం

పూర్తి కాని స్త్రీ శక్తి భవనం 

ఏడేళ్లుగా నిలిచిన పనులు

అద్దె భవనంలో కొనసాగుతున్న

సర్కారు కార్యాలయాలు

పట్టించుకోని పీఆర్‌ అధికారులు

పుల్లలచెరువు, ఏప్రిల్‌ 21 : అధికారుల నిర్లక్ష్యం అభివృద్ధికి శాపంగా మారుతోంది. మండల కేంద్రమైన పుల్లలచెరువులో ప్రభుత్వ కార్యాలయం కోసం ఏడు సంవత్సరాల క్రితం ప్రాంభించిన స్త్రీ శక్తి భవన నిర్మాణం అధికారుల నిర్లక్ష్యంతో మధ్యలోనే అర్ధంతరంగా నిలిచి పోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ, ఎన్‌ఆర్‌జీఎస్‌ సిబ్బంది  కోసం లక్షలాది రూపాయలు కేటాయించి కార్యాల యం నిర్మాణం 2013లో  చేపట్టారు. కాని నిర్మాణం 2014లో 75 శాతం పూర్తి అయి నప్పటికీ ఈ భవనం పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. స్ర్తీ శక్తి భవనం పనులు గత ఏడు సంవత్సరాల క్రితం ఎన్‌ఆర్‌జీఎస్‌ నిధుల నుంచి రూ.12 లక్షల అంచనాలతో పనులు ప్రారంభించారు. ప్రారంభ దశలో పనులు చకచకా జరిగినప్పటికీ ఆ తరువా త కాంట్రాక్టర్‌  లోపం వల్ల పనులు నిలిచి పోయాయి. దీంతో గత ఐదు సంవత్సరాల క్రితం మార్కాపురం పీఆర్‌ ఈఈ వెంకటేశ్వరరావు పరిశీలించి భవనం అర్ధంతంగా నిలిచిపోవడంతో కాంట్రాక్టర్‌, అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత నుంచి ఎ వరూ పట్టించుకోకపోవడంతో పనుల్లో పురోగతి లేదు. కాంట్రాక్టర్‌, అఽధికారులు నెల రోజుల్లో పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన రెం డు రోజులు హడావుడి చేసి మరచిపోయారు. భవనాన్ని మెదలు పెట్టి 7 సంవత్సరాలు దాటినా ఇంత వరకు పట్టించుకునే నాథుడే లేడు.  స్త్రీ్త్రశక్తి భవనాన్ని పూర్తి చేసేదేప్పుడోనని అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో పంచాయతీరాజ్‌ అధికారులు ఈ భవనాన్ని పరీశిలించి రెండు నెలల్లో పూర్తి చేయిస్తామని హమీ  ఇచ్చిన ఐదేళ్లకు పూర్త యింది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టినప్పటికీ దానిని వినియోగంలోకి తీసుకరాలేదు. చాలీచాలని అద్దె భవనాల్లో వెలుగు కార్యాలయం కొనసాగు తోంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయానికి ఒక్క గది కేటాయించడంతో అక్కడ విధి నిర్వహణలో సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ అధి కారులకు   కాంట్రాక్టర్‌ పర్సేంటేజీ ఇచ్చే స్థోమత లేక పోవడంతోనే అధికారులు పనులను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. 

ఇప్పటికైనా ఉన్నతాధి కారులు స్పందించి ఏడు సంవత్సరాలుగా నిలిచిపోయిన  స్త్రీ శక్తి భవనాన్ని వేంటనే పూర్తి చేయాలని  ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-04-22T05:51:45+05:30 IST