అత్యవసరమైతేనే.. బయటకు రండి!

ABN , First Publish Date - 2021-05-06T05:06:22+05:30 IST

‘జిల్లాలో కరోనా తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లలో ఉండడమే శ్రేయస్కరం. అత్యవసరమైతేనే బయ టకు రండి’ అని ప్రజలకు ఎస్పీ అమిత్‌బర్దర్‌ సూచించారు. అత్యవసరమై బయటకు రావాలంటే ముందస్తు అనుమతి కోసం 94944 66406 నెంబర్‌ను సంపద్రించా లని తెలిపారు.

అత్యవసరమైతేనే.. బయటకు రండి!
శ్రీకాకుళంలో కర్ఫ్యూ అమలును పరిశీలిస్తున్న ఎస్పీ అమిత్‌బర్దర్‌

 కరోనా వేళ.. కఠిన ఆంక్షలు తప్పవు

 అనుమతి కోసం 94944 66406 నెంబర్‌ను సంప్రదించండి : ఎస్పీ అమిత్‌బర్దర్‌ 

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 5 : ‘జిల్లాలో కరోనా తీవ్రరూపం దాల్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లలో ఉండడమే శ్రేయస్కరం. అత్యవసరమైతేనే బయ టకు రండి’ అని ప్రజలకు ఎస్పీ అమిత్‌బర్దర్‌ సూచించారు.    అత్యవసరమై బయటకు రావాలంటే ముందస్తు అనుమతి కోసం 94944 66406 నెంబర్‌ను సంపద్రించా లని తెలిపారు. శ్రీకాకుళంలో బుధవా రం మధ్యాహ్నం కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. ఇతర ప్రాంతాల్లో ఎక్కడైనా నిబంధనలు అతిక్రమిస్తున్నారా... ప్రజలు గుమిగూడారా అన్నది డ్రోన్‌ కెమెరాలతో పర్యవేక్షించా రు. అనంతరం పోలీసు వాహనాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘జిల్లా అంతటా పకడ్బందీగా కర్ఫ్యూ అమలు చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేర కు రెండువారాల పాటు నిబంధనలు పక్కాగా అమలు చేస్తాం. ఉదయం వేళ.. అత్యవసరమై బయటకు వచ్చినా.. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే కఠినచర్యలు తప్పవు. కరోనా నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలి’ అని ఎస్పీ కోరారు. వైద్యంతో పాటు ఇతర అత్యవసర సేవలకు మాత్రమే కర్ఫ్యూ వేళ రాకపోకలకు అనుమతి ఉంటుందని  తెలిపారు. కేవలం అత్యవసరమైతేనే.. ఆరోగ్య సమస్యలు తలెత్తితేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టౌన్‌ డీఎస్పీ మహేంద్ర, ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు, సీఐలు ప్రసాద్‌, అంబేద్కర్‌, ఇతర ఎస్‌ఐలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:06:22+05:30 IST