అక్రమ మద్యం తయారీని కనిపెట్టేందుకు రంగంలోకి హెలికాప్టర్లు

ABN , First Publish Date - 2022-02-23T18:16:49+05:30 IST

బీహార్ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీని కనిపెట్టేందుకు సర్కారు హెలికాప్టర్లను రంగంలోకి దించింది...

అక్రమ మద్యం తయారీని కనిపెట్టేందుకు రంగంలోకి హెలికాప్టర్లు

పట్నా(బీహార్): బీహార్ రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీని కనిపెట్టేందుకు సర్కారు హెలికాప్టర్లను రంగంలోకి దించింది.మద్య నిషేధాన్ని ఉల్లంఘించిన వారిని అణిచివేసేందుకు బీహార్ ప్రభుత్వం గతంలో డ్రోన్‌లను మోహరించింది.బీహార్ రాష్ట్రంలో మద్యం స్మగ్లర్లను పట్టుకునేందుకు బీహార్ ప్రభుత్వం తాజాగా హెలికాప్టర్లను మోహరించింది.బీహార్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు మంగళవారం హెలికాప్టర్‌లో ఎక్కి పాట్నా, దాని పరిసర ప్రాంతాల్లో విహంగ వీక్షణం చేసి నిఘా ఉంచారు.ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నా విమానాశ్రయంలో అక్రమ మద్యం తయారీదారులను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్‌ను పరిశీలించారు.


 అక్రమ మద్యం తయారీదారులను పట్టుకునేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రొహిబిషన్ విభాగం అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. 2016వ సంవత్సరం ఏప్రిల్ 6వతేదీన నితీష్ కుమార్ ప్రభుత్వం బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించింది.


Updated Date - 2022-02-23T18:16:49+05:30 IST