వృద్ధులకు మందులు పంపిణీ చేస్తున్న రాఘవరెడ్డి
మొయినాబాద్ రూరల్, జూలై 6: వర్షకాలంలో ఆరోగ్యపరిరక్షణకు పాటుపడాలని సర్పంచుల సంఘం జిల్లా ఉపాద్యక్షుడు, బాకారం జాగీర్ సర్పంచ్ కొత్తపల్లి రాఘవరెడ్డి అన్నారు. బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అధ్వర్యంలో గ్రామస్థులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి తారాభాయ్, వైద్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.