నీకన్నా నాకు కుక్కలే ఎక్కువ ఇష్టమన్న Ranbir Kapoor.. కత్రినాతో పాత ఇంటర్వ్యూ వైరల్

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో పెళ్లంటూ ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అందాల తార కత్రినా కైఫ్. అయితే ఈ బ్యూటీ యంగ్ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో ప్రేమాయణం నడిపిందని అందరికి తెలిసిన విషయమే. ఆరు సంవత్సరాల రిలేషన్ తర్వాత 2015లో ‘రాక్‌స్టార్’ స్టార్‌తో విడిపోయింది ఈ భామ. ప్రస్తుతం విక్కీతో లవ్‌లో పడి పెళ్లి దాకా వెళ్లింది.


విక్కీతో పెళ్లి జరగబోతున్న ఈ తరుణంలో ‘జగ్గ జసూస్’ సమయంలో రణ్‌బీర్‌తో కత్రినా కైఫ్‌ చేసిన ఓ ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. అందులో క్యాట్ ‘నీ జీవితంలో అతి ముఖ్యమైన ఐదుగురి పేర్లు చెప్ప‌’ని అడగుతుంది. దానికి సమాధానం ఇస్తూ.. ‘అమ్మ, నాన్న, నా కొడలు, డైరెక్టర్ ముఖర్జీ.. నీకు నచ్చకపోవచ్చు కానీ నా రెండు కుక్కలు’ అని ఈ చాక్లెట్ బోయ్ చెప్పాడు. వెంటనే ఈ భామ అందుకుని వెటకారంగా మనం భ్రమ, అహంకారంతో బాధపడుతున్నామని కౌంటర్ ఇచ్చింది.


బ్రేకప్ తర్వాత విక్కీతో కత్రినా లవ్ చేయగా.. అలియా భట్‌తో రణ్‌బీర్ కపూర్ ప్రేమలో పడ్డాడు. అయితే సినిమాల విషయానికి వస్తే క్యాట్, రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా చేసిన ‘సూర్యవంశీ’ ఇటీవలే విడుదలై మంచి హిట్‌ని అందుకుంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి ‘టైగర్ 3’ చేస్తోంది. రణ్‌బీర్ విషయానికి వస్తే ఇంతకుముందు సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’తో వెండితెరపై కనిపించగా.. ప్రస్తుతం షాంషేరా, బ్రహ్మస్త్ర సినిమాలు చేస్తున్నాడు.


Advertisement

Bollywoodమరిన్ని...