Viral video: అత్యంత ఉత్కంఠ మధ్య మహిళ ప్రాణాలు కాపాడిన RPF Constable.. నెటిజన్ల ప్రశంసలు

ABN , First Publish Date - 2022-06-23T23:23:53+05:30 IST

నరాలు తెగే ఉత్కంఠతో అందరూ చూస్తుండగా ఓ మహిళ ప్రాణాలను RPF Constable కాపాడారు.

Viral video: అత్యంత ఉత్కంఠ మధ్య మహిళ ప్రాణాలు కాపాడిన RPF Constable.. నెటిజన్ల ప్రశంసలు

నరాలు తెగే ఉత్కంఠతో అందరూ చూస్తుండగా ఓ మహిళ ప్రాణాలను RPF Constable కాపాడారు. 18 నెలల్లో పదవీ విరమణ చేయనున్న ఈ అధికారి 33 ఏళ్ల పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో పనిచేశారు. సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డు అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అధికారిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 


ఇది కూడా చదవండి..

పెళ్లి వేడుకలో తుపాకీ పేల్చిన వరుడు.. బుల్లెట్ బయటకు వచ్చిందనుకుని కిందకు దించగానే ఊహించని సీన్



ఆమె సురక్షితంగా ప్లాట్‌ఫామ్ ఎక్కుతుందా? లేదా? అనే అందరూ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూశారు. అంతలో కమ్లేష్ ప్లాట్‌ఫామ్ చివరి వరకు వెళ్లి తన బలాన్ని అంతా ఉపయోగించి ఆ మహిళను చివరి నిమిషంలో పైకి లాగారు. కేవలం ఒక సెకెను వ్యవధిలో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కమ్లేష్‌పై నెటిజన్లు `సూపర్ మ్యాన్` అని ప్రశంసలు కురిపిస్తున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు మహిళలు పట్టాల పై నుంచి ప్లాట్‌ఫామ్‌‌లు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో రెండో నెంబర్ ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వరిస్తున్న కమ్లేష్ కుమార్ దుబే వారిని వారించాడు. అయినా వారు వినకుండా ముందుకే కదలారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకువస్తోంది. అప్పటికే ఓ మహిళ ప్లాట్‌ఫామ్‌ పైకి ఎక్కేసింది. మరో మహిళ ఇంకా పట్టాలు దాటుతోంది. 

Updated Date - 2022-06-23T23:23:53+05:30 IST