sugar ఎగుమతులపై Centre ఆంక్షలు

ABN , First Publish Date - 2022-05-25T18:44:20+05:30 IST

దేశీయ అవసరాల దృష్ట్యా పంచదార డిమాండ్‌కు తగ్గట్టు నిల్వలు, ధరల స్థిరీకరణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుం

sugar ఎగుమతులపై Centre  ఆంక్షలు

న్యూఢిల్లీ : దేశీయ అవసరాల దృష్ట్యా పంచదార ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. డిమాండ్‌కు తగ్గట్టు నిల్వలు, ధరల స్థిరీకరణ దృష్ట్యా గత ఆరేళ్లలో తొలిసారి పంచదార ఎగుమతులపై పరిమితులు విధించింది. 100 LMT(లాంగ్ టన్ మెజర్‌మెంట్)లకు మించి పంచదార  ఎగుమతి చేయడానికి వీల్లేదని ప్రకటించింది. జూన్ 1 నుంచి ఈ పరిమితి వర్తిస్తుందని తెలిపింది.   రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా పంచదార సప్లయిలో అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. 


కేంద్రం విధించిన ఈ  పరిమితితో షుగర్ సీజన్ ముగిసే సెప్టెంబర్ 30, 2022 సమయానికి భారత్‌ వద్ద 65-65 ఎల్‌ఎంటీ టన్నుల పంచదార నిల్వలు  ఉంటాయి. ఈ స్టాక్ దాదాపు 2-3 నెలలపాటు సరిపోతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం నెలకు దాదాపు 24 ఎల్‌ఎంటీ పంచదార అవసరమవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా కీలకమైన 3 రాష్ట్రాల్లో అక్టోబర్ - నవంబర్ నెలల్లో  షుగర్ క్రిషింగ్ సీజన్ మొదలవుతుంది. అక్టోబర్ చివరి వారంలో కర్ణాటకలో, అక్టోబర్-నవంబర్ మధ్య నవంబర్, ఉత్తరప్రదేశ్‌లో నవంబర్‌లో  మొదలవుతాయి. ఇందుకు తగ్గట్టు ఇప్పటికే కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఆ తర్వాత తగిన నిల్వలు అందుబాటులోకి రానున్నాయి.

Updated Date - 2022-05-25T18:44:20+05:30 IST