బెయిల్ గడువు ముగియగానే Imran Khanను అరెస్ట్ చేస్తాం..పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-06-06T14:59:26+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బెయిల్‌ గడువు ముగియగానే అరెస్ట్‌ చేస్తామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా చెప్పారు...

బెయిల్ గడువు ముగియగానే Imran Khanను  అరెస్ట్ చేస్తాం..పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు

కరాచీ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బెయిల్‌ గడువు ముగియగానే అరెస్ట్‌ చేస్తామని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రాణా సనావుల్లా చెప్పారు.ఇమ్రాన్ ఖాన్‌పై అల్లర్లు, దేశద్రోహం, గందరగోళం, సాయుధ దాడులతో సహా రెండు డజనుకు పైగా కేసులు నమోదయ్యాయని మంత్రి పేర్కొన్నారు. బెయిల్ గడువు ముగియగానే మాజీ ప్రధాని ఇమ్రాన్ ను బనిగాలా నివాసం వెలుపల సెక్యూరిటీ అరెస్టు చేస్తుందని కూడా మంత్రి వివరించారు.పెషావర్ హైకోర్టు  జూన్ 2న ఇమ్రాన్ ఖాన్‌కు మూడు వారాల ట్రాన్సిట్ బెయిల్ మంజూరు చేసింది. బెయిలు కోసం పాకిస్తాన్ హైకోర్టు రూ. 50,000 పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.


పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అతని భార్య బుష్రా బీబీ, ఆమె స్నేహితురాలు ఫరా గోగీల త్రయం బిలియన్లు సంపాదించారని పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ ఆరోపించింది.


Updated Date - 2022-06-06T14:59:26+05:30 IST