Lahore వీధుల్లో ఇమ్రాన్ మద్ధతుదారుల నిరసన ర్యాలీ

ABN , First Publish Date - 2022-04-11T13:37:49+05:30 IST

పాకిస్థాన్ దేశ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్‌ను తొలగింపును వ్యతిరేకిస్తూ వేలాదిమంది అతని మద్ధతుదారులు లాహోర్ వీధుల్లోకి వచ్చి నిరసన ర్యాలీ జరిపారు....

Lahore వీధుల్లో ఇమ్రాన్ మద్ధతుదారుల నిరసన ర్యాలీ

లాహోర్: పాకిస్థాన్ దేశ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్‌ను తొలగింపును వ్యతిరేకిస్తూ వేలాదిమంది అతని మద్ధతుదారులు లాహోర్ వీధుల్లోకి వచ్చి నిరసన ర్యాలీ జరిపారు.పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అవిశ్వాస ఓటింగులో ఓడిపోవడంతో అతన్ని ప్రధాని పదవి నుంచి తొలగించారు.ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు వేలాదిగా తరలివచ్చి పాకిస్థాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (పీడీఎం)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యులు ఆదివారం కూడా పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో ర్యాలీలు చేశారు. ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్, మలాకాండ్, ముల్తాన్ ఖనేవాల్, ఖైబర్, జాంగ్, క్వెట్టా నగరాల్లో నిరసన ప్రదర్శనలు జరిపారు.


తన పాలన మార్పు విదేశీ కుట్ర అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేశారు.విదేశీ కుట్రకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య పోరాటం ప్రారంభమైందని ఇమ్రాన్ పేర్కొన్నారు.పాకిస్థాన్ దేశ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవి నుంచి తొలగింపునకు గురైన తొలి ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ నిలిచారు.


Updated Date - 2022-04-11T13:37:49+05:30 IST