పాక్ అసెంబ్లీ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా... నేడు ఇమ్రాన్ ధర్నా...

ABN , First Publish Date - 2022-04-04T22:03:53+05:30 IST

ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

పాక్ అసెంబ్లీ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా... నేడు ఇమ్రాన్ ధర్నా...

ఇస్లామాబాద్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. సభను రద్దు చేసే హక్కు డిప్యూటీ స్పీకర్‌కు లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ పక్ష వాదనను సుప్రీం మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నరకు విననుంది. 


మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలు తనపై మూడున్నరేళ్లుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాలు కోట్లాది రూపాయలు వెచ్చించి సభ్యులను కొనుగోలు చేసేందుకు యత్నించాయని, తన ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్నాయని ఇమ్రాన్ చెప్పారు. ప్రతిపక్షాల తీరుకు నిరసనగా ఇస్లామాబాద్‌లో నేడు ధర్నా చేస్తానని ఇమ్రాన్ ప్రకటించారు. తాను అమెరికాకు స్నేహ హస్తం అందించినా తనను నమ్మడం లేదని, తనకు విలువ ఇవ్వడం లేదని ఇమ్రాన్ వాపోయారు. 90 రోజుల్లో ఎన్నికలు ఖాయమని భావిస్తోన్న ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ టికెట్లపై నిర్ణయం తీసుకునేందుకు పార్టీ నేతలతో మంగళవారం కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.   


ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ప్రతిపక్షాలు నిన్న ఉదయం అవిశ్వాస తీర్మానం పెట్టగా పాక్‌ నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూర్ తిరస్కరించారు. అనంతరం  ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభను రద్దు చేయాలని అధ్యక్షుడు ఆరిఫ్ అలీకి సిఫార్సు చేశారు. ఇమ్రాన్ ప్రభుత్వ సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఆరిఫ్ అలీ సభను రద్దు చేశారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు సభ రద్దు నేపథ్యంలో ఇమ్రాన్ ప్రధానిగా నిర్ణయాలు తీసుకోలేరని పాక్ కేబినెట్ సెక్రటేరియట్ స్పష్టం చేసింది. 

Updated Date - 2022-04-04T22:03:53+05:30 IST