ఇమ్రాన్ చివరి నిమిషం వరకూ పాక్ ఆర్మీని బతిమాలారు

ABN , First Publish Date - 2022-04-27T22:56:13+05:30 IST

లహోర్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఇష్టంలేని imran khan చివరి వరకూ ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేశారు. తన ప్రభుత్వాన్ని కాపాడాలంటూ చివరి నిమిషం వరకూ

ఇమ్రాన్ చివరి నిమిషం వరకూ పాక్ ఆర్మీని బతిమాలారు

లహోర్ : పాకిస్తాన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఇష్టంలేని imran khan చివరి వరకూ ప్రభుత్వాన్ని రక్షించుకునే ప్రయత్నాలు చేశారు. తన ప్రభుత్వాన్ని కాపాడాలంటూ చివరి నిమిషం వరకూ పాక్ ఆర్మీని బతిమాలారని  అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు Maryam Nawaz ఆరోపించారు. అయితే ఈసారి రాజకీయ వివాదంలో pakistan army జోక్యం చేసుకోలేదు. షెబాజ్ షరీఫ్, ఇమ్రాన్ ఖాన్ మధ్య వివాదంలో పాక్ ఆర్మీ దూరం పాటించిందని ఆమె గుర్తుచేశారు. అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందు పాక్ మాజీ అధ్యక్షుడు, పీపీపీ కో-చైర్మన్ అసిఫ్ అలీ జర్దారీ సాయాన్ని కూడా ఇమ్రాన్ ఖాన్ ఆర్జించారని ఆమె విమర్శించారు. లాహోర్‌లో గురువారం రాత్రి నిర్వహించిన ఓ  కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. అవిశ్వాస తీర్మానానికి పాక్ సుప్రీంకోర్ట్ అనుమతి ఇచ్చేవరకూ ఆయన ఈ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఏప్రిల్ 10న ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధాని పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-27T22:56:13+05:30 IST