పరువు నష్టం కేసులో ఇమ్రాన్‌కు కోర్టు నోటీసు

ABN , First Publish Date - 2020-06-07T08:32:14+05:30 IST

పీఎంఎల్‌-ఎన్‌ అధ్యక్షుడు షాబాజ్‌ షరీఫ్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఓ స్థానిక కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో ముందస్తుగా విచారణ

పరువు నష్టం కేసులో ఇమ్రాన్‌కు కోర్టు నోటీసు

లాహోర్‌, జూన్‌ 6: పీఎంఎల్‌-ఎన్‌ అధ్యక్షుడు షాబాజ్‌ షరీఫ్‌ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకు సంబంధించి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు ఓ స్థానిక కోర్టు నోటీసు జారీ చేసింది. ఈ కేసులో ముందస్తుగా విచారణ చేపట్టాలని షరీఫ్‌ కోర్టును ఆభ్యర్థించిన నేపథ్యంలో నోటీసు జారీ అయింది. పాకిస్తాన్‌ మాజీ ప్రధాని, తన పెద్దన్నయ్య నవాజ్‌ షరీ్‌ఫపై సుప్రీం కోర్టులో ఉన్న పనామా పేపర్ల కేసును ఉపసంహరించుకోవడానికి ఒక స్నేహితుడి ద్వారా షాబాజ్‌ షరీఫ్‌ తనకు 6.1 కోట్ల డాలర్లు ఇస్తానని చెప్పినట్టు 2017 ఏప్రిల్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపించారు. ఈ కేసులో వాదనలు విన్న తర్వాత జూన్‌ 10 వరకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఇమ్రాన్‌ ఖాన్‌కు అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి సొహైల్‌ అంజుమ్‌ నోటీసు జారీ చేశారు.  

Updated Date - 2020-06-07T08:32:14+05:30 IST