Abn logo
Sep 17 2020 @ 00:19AM

మెరుగైన బాలు ఆరోగ్యం

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం గతంతో పోల్చితే మరింత మెరుగుపడింది. ఈ విషయాన్ని బాలు తనయుడు చరణ్‌ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. ‘‘ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. ఆరోగ్యం బాగా మెరుగుపడడం వల్ల త్వరలో ఎక్మో, వెంటిలేటర్‌ చికిత్స అవసరం ఉండకపోవచ్చని భావిస్తున్నాం’’ అని తెలిపారు. బాలుకు చికిత్సను అందిస్తున్న ఎంజీఎం హాస్పిటల్స్‌ వైద్యులకు, ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న అభిమానులకు చరణ్‌ కృత జ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement