వర్టికల్‌ విధానంతో మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2021-08-04T05:24:15+05:30 IST

జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వర్టికల్‌ విధానం అమలు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలందించగలమని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నా రు.

వర్టికల్‌ విధానంతో మెరుగైన సేవలు
పోలీసు అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

ఆదిలాబాద్‌టౌన్‌, ఆగస్టు 3: జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వర్టికల్‌ విధానం అమలు చేయడంతో ప్రజలకు మెరుగైన సేవలందించగలమని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నా రు. జిల్లాలో 12వర్టికల్‌ అంశాల్లో పోలీసులకు బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లోని పోలీసు సమావేశ మందిరంలో  వర్టికల్‌ ఇన్‌చార్జి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు.  శాంతి భదత్రలను పరిరక్షిస్తూ తమ ఆర్థిక నేరాలను కట్టడి చేస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలను కొనసాగించాలని, ప్రతి రోజూ 12వర్టికల్‌ అంశాల్లో నిర్వహించిన విధులను పర్యవేక్షించే అధికారం సీఐ, డీఎస్పీలకు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఇన్‌చార్జి అధికారులు వీరే..

రిసెప్షనిస్టుగా ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ కె.పురుషోత్తంచారి, స్టేషన్‌, నేర దర్యాప్తు రైటర్లుగా జైనథ్‌ సీఐ కొంక మల్లేష్‌, కంప్యూటర్‌, టెక్నికల్‌ టీమ్‌ కమ్యూనికేషన్‌గా ఎస్సై గంగాసాగర్‌, న్యాయస్థానం విధులు అధికారిగా టూటౌన్‌ సీఐ పోతారం శ్రీనివాస్‌, వారెంట్లు, సామాన్లు పర్యవేక్షకులుగా ఇచ్చోడ సీఐ కంప రవీందర్‌, పోలీసు స్టేషన్‌ ఇన్‌చార్జి అధికారులుగా ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, పెట్రోలిం గ్‌ వాహనాలు, బ్లూకోర్టు, షీ టీమ్‌ ఇన్‌చార్జి బేల ఎస్సై సాయన్న, మెడికల్‌, పీఎంఈ, ఎఫ్‌ఎఫ్‌ఎల్‌ తదితర సర్టిఫికేట్లు పరిశీలకులుగా బజార్‌హత్నూర్‌ ఎస్సై ఉదయ్‌కుమార్‌, నేరాలను నిరోధించడం, పోలీసు స్టేషన్‌ రోజు వారి విధులు పరిశీలకులుగా సీసీఎస్‌ సీఐ చంద్రమౌళి, 5ఎస్‌ విధానం నార్నూర్‌ సీఐ కె.ప్రేమ్‌కుమార్‌, కమ్యూనిటీ పోలీసింగ్‌ పరిశీలకులుగా ఉట్నూర్‌ సీఐ నరేష్‌కుమార్‌, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ ట్రాఫీక్‌సీఐ ఎ.రాంనర్సింహారెడ్డి పర్యవేక్షణలో 12 వర్టికల్‌ విధానాలు కొనసాగుతాయన్నారు. పోలీసు స్టేషన్లు, కార్యాలయాలను శుభ్రంగా ఉంచి నాణ్యమైన సేవలు అందించే వాతావరణం కల్పించేందుకు 5-ఎఫ్‌ వర్టికల్‌ విధానంతో పాటు ఇతర విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర ఇతర జిల్లాలతో పోటీపడి మెరుగైన ర్యాంకు సాధించాలని సూచించారు. ఇందులో అదనపు ఎస్పీ శ్రీనివాస్‌రావు, ఏఎస్పీ హర్షవర్ధన్‌ శ్రీవాత్సవ్‌, వర్టికల్‌ ఇన్‌చార్జి సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-04T05:24:15+05:30 IST