ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2021-04-21T06:07:19+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
సూర్యాపేటలో మాతాశిశు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్‌, జగదీష్‌రెడ్డి

మంత్రులు ఈటల రాజేందర్‌, జగదీష్‌రెడ్డి

పేటలో మాతా, శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం

సూర్యాపేట(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 20 : ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌, విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి అన్నారు. జిల్లాలో మాతా, శిశు సంరక్షణ కేంద్రాల ద్వారా మహిళలకు మెరుగైన వైద్య సేవలందించనున్నట్లు వారు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి పక్కన రూ.7 కోట్లతో నిర్మించిన 50 పడకల మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని మంగళవారం వారు ప్రారంభించి,  మాట్లాడారు. మాతా, శిశు సంరక్షణ కేంద్రాల ద్వారా గర్భిణులకు 24గంటల పాటు వైద్య సేవలందుతాయన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేసి సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలందిస్తున్నట్లు స్పష్టం చేశారు. అనంతరం మాతా, శిశు కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా కమిషనర్‌ వాకాటి కరుణ, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌, మార్కెట్‌ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాఆనంద్‌, జడ్పీ వైస్‌చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ కోటా చలం పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T06:07:19+05:30 IST