ఒమైక్రాన్‌ ఇన్ఫెక్షన్‌తోనే మెరుగైన ఇమ్యూనిటీ

ABN , First Publish Date - 2022-05-17T08:00:58+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో.. బూస్టర్‌ డోసు కంటే ఎక్కువ స్థాయిలో రోగ నిరోధక స్పందనను శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఒమైక్రాన్‌ ఇన్ఫెక్షన్‌తోనే మెరుగైన ఇమ్యూనిటీ

బయోఎన్‌టెక్‌-వాషింగ్టన్‌ 

వర్సిటీ అధ్యయనంలో వెల్లడి


న్యూఢిల్లీ, మే 16 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాక ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకిన వారిలో.. బూస్టర్‌ డోసు కంటే ఎక్కువ స్థాయిలో రోగ నిరోధక స్పందనను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇటువంటి వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు వివిధ రకాల కొవిడ్‌ వేరియంట్లనూ బలంగా ఎదుర్కోగలవని వెల్లడించారు. ఫైజర్‌ టీకా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన జర్మనీ కంపెనీ ‘బయోఎన్‌టెక్‌’, వాషింగ్టన్‌ వర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈవిషయం వెల్లడైంది. ఈమేరకు వివరాలతో కూడిన అధ్యయన నివేదిక ‘బయో ఆర్కైవ్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది. దీన్ని పెన్సిల్వేనియా వర్సిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇమ్యునాలజీ డైరెక్టర్‌ జాన్‌ వెర్రీ సమీక్షించారు.

Updated Date - 2022-05-17T08:00:58+05:30 IST