ఆకట్టుకున్న స్టాళ్లు, శకటాలు

ABN , First Publish Date - 2021-01-27T05:54:44+05:30 IST

ఉద్యాన వన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ. ఆటవీ శాఖ, జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షాభియాన్‌, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టు పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, సూక్ష్మ నీటి

ఆకట్టుకున్న స్టాళ్లు, శకటాలు
ప్రథమ స్థానంలో నిలిచిన ఐటీడీఏ శకటం


కలెక్టరేట్‌: వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాల్స్‌ ఆకట్టుకున్నాయి. వ్యవసాయ శాఖ పంటలు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉద్యాన వన, జిల్లా గ్రామీణాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ, స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన అభివృద్ధి సంస్థ, వైద్య, ఆరోగ్యశాఖ. ఆటవీ శాఖ, జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్షాభియాన్‌, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ, పట్టు పరిశ్రమ, నైపుణ్యాభివృద్ధి సంస్థ, సూక్ష్మ నీటి పారుదల శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పోరేషన్లకు సంబంధించి స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ అమిత్‌ బర్దర్‌,  జేసీలు సుమిత్‌ కుమార్‌, కె.శ్రీనివాసులు స్టాళ్లను తిలకించి అభినందించారు. శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి హామీ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, అటవీ శాఖలు ప్రగతి శకటాలను ప్రదర్శించాయి. కలెక్టర్‌ నివాస్‌తో పాటు అధికారులు తిలకించారు. ఇందులో గిరిజనాభివృద్ధి సంస్థ శకటానికి ప్రథమ స్థానం దక్కింది. గ్రామీణాభివృద్ధి శకటానికి ద్వితీయ, ఉపాధి హామీ పథకం (డ్వామా)కు మూడో స్థానం దక్కింది.




Updated Date - 2021-01-27T05:54:44+05:30 IST