గోదావరిఖనిలో ఆకట్టుకున్న రామ్‌లీలా

ABN , First Publish Date - 2021-10-17T05:57:47+05:30 IST

దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది.

గోదావరిఖనిలో ఆకట్టుకున్న రామ్‌లీలా
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- కిటకిటలాడిన సింగరేణి స్టేడియం 

- పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్‌

గోదావరిఖని, కోల్‌సిటీ, అక్టోబరు 16: దసరా ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి గోదావరిఖని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) కుమార్‌ దీపక్‌, కమిషనర్‌ శంకర్‌కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామగుం డం నియోజకవర్గం ఇండస్ర్టియల్‌ కారిడార్‌గా అత్యం త ప్రాధాన్యత కలిగిన ప్రాంతమని, సింగరేణి, ఎన్‌టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌, జెన్‌కో పరిశ్రమలతో ఇండస్ర్టియల్‌ కారిడార్‌గా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్‌ నేతృత్వంలో కోట్లాదిరూపాయల నిధులు వెచ్చించి ఈప్రాం తం అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినవాడిగా ఈ ప్రాంత అభివృద్ధిపై తనకు ప్రత్యేక శ్రద్ధ ఉందని, గోదావరిఖనిని మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు మరింత సహకారం అందిస్తానన్నారు. రామగుండం ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా సేవలందిస్తానని ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్‌ పేర్కొన్నారు. రామగుండం ప్రజల దశాబ్దాల కల అయిన మెడికల్‌ కళాశాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాకారం చేశారన్నారు. కేటీఆర్‌ సహకారంతో త్వరలోనే ఐటీ పార్కు ఏర్పాటు చేయబోతున్నామని, తద్వా రా రామగుండాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు, గోదావరిఖని కి చెందిన తాగు బోతు రమేష్‌ హాజరై ప్రసంగించారు. పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనం తరం రావణ దహన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. మేయర్‌ బంగి అనీల్‌కుమార్‌ అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిర్వహించారు. చిన్నారులు చేసిన సాసం్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించా యి. మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ తానిపర్తి గోపాల్‌రావు డ్యాన్స్‌ చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో భారీ పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్‌ పెద్దెల్లి తేజస్విని, వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, కోఆప్షన్‌ సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T05:57:47+05:30 IST