ఆకట్టుకునే బహుమతులు!

ABN , First Publish Date - 2021-02-13T05:47:33+05:30 IST

ఇచ్చిపుచ్చుకోవడంతోనే బంధాలు, అనుబంధాలు బలపడతాయి. వాలెంటైన్‌ డే లాంటివి వస్తే చాలు బహుమతుల హడావుడి అంతా ఇంతా కాదు. ఏ రకమైన బహుమతులు

ఆకట్టుకునే బహుమతులు!

ఇచ్చిపుచ్చుకోవడంతోనే బంధాలు, అనుబంధాలు బలపడతాయి. వాలెంటైన్‌ డే లాంటివి వస్తే చాలు బహుమతుల హడావుడి అంతా ఇంతా కాదు.  ఏ రకమైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుందామా అని యువత ఆలోచిస్తుంటాయి. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు ఈ కామర్స్‌ పోర్టల్స్‌, గాడ్జెట్‌ సంస్థలు పోటీ పడుతున్నాయి.  వాటిలో ఆకట్టుకునే ఈ ఐదారింటిపై ఓ లుక్‌ వేయండి. 


యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ప్రొ

దీని ధర రూ.24,990. నాయిస్‌ కాన్సిలేషన్‌ ఫీచర్‌, యాంబియంట్‌ మోడ్‌ దీని ప్రత్యేకతలు. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ కేస్‌తో 24 గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. ఇయర్‌ బడ్స్‌ విని ఆనందించేందుకు వీలుగా ఉంటాయి. పైపెచ్చు నీటి నుంచి రక్షణ(వాటర్‌ప్రూఫ్‌) సదుపాయం కూడా ఉంది.  


శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ ఫిట్‌

అమోల్డ్‌ టచ్‌ స్ర్కీన్‌తో రంగుల్లో ఇది విడుదలైంది. హార్ట్‌ బీట్‌(హృదయస్పందన) రేట్‌ను నిరంతరం తెలుసుకునే వీలు ఇందులో ఉంది. రేటు పెరిగితే అలర్ట్‌ చేసే సదుపాయానికి తోడు 120 ఎంఎహెచ్‌ బ్యాటరీ సపోర్ట్‌ ఉంది. అమెజాన్‌తో రూ.9,900కి కొనుగోలు చేయవచ్చు. 


యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఇ

అతి పెద్ద రెటీనాతో ఒలెడ్‌ స్ర్కీన్‌తో విడుదలైంది. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 3తో పోల్చుకుంటే ఇది రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. 44ఎంఎంతో వైఫై వేరియంట్‌గా దీని ప్రస్తుత రేటు రూ.32,990. స్విమ్‌ ప్రూఫ్‌ డిజైన్‌కు తోడు యోగా, స్విమ్మింగ్‌ వంటి వాటికి సంబంధించి మెజరింగ్‌కూ ఉపయోగపడుతుంది. 


రియల్‌మీ వాచ్‌-ఎస్‌ ప్రొ

దీని ప్రస్తుత ధర రూ.7,999. ఇది డిస్కౌంట్‌ రేటు. ఈ రేటుతో అమెజాన్‌ అమ్మకాలు జరుపుతోంది. 1.3 ఇంచ్‌ల టచ్‌స్ర్కీన్‌,  ఐపి68 రేటింగ్‌ కలిగిన దీని బ్యాటరీ లైఫ్‌ 15 రోజులు.




శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ యాక్టివ్‌

దీని రేటు 19,990. అమోల్డ్‌ స్ర్కీన్‌కు తోడు నిరంతరాయంగా ఆన్‌-డిస్‌ప్లే వాచ్‌. 39 బిల్ట్‌ ఇన్‌ ఎక్స్‌ర్‌సైజ్‌ సదుపాయం ఉంది. వాటర్‌ రెసిస్టెంట్‌ కాగా 50 అడుగుల లోతువరకూ వాటర్‌ లాక్‌ మోడ్‌ చేసుకోవచ్చు.


వన్‌ప్లస్‌ ఆఫర్‌

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిస్కౌంట్లు, ఆఫర్లను వన్‌ప్లస్‌ ప్రకటించింది. వివిధ ప్రొడక్టులపై రాయితీలను అందిస్తోంది


వన్‌ప్లస్‌ 8 ప్రొ

దీని రేటు రూ.54,999. ఎస్‌బిఐ ఆఫర్‌కు తోడు నాలుగు వాయిదాలు ఒకేసారి చెల్లిస్తే 18 నెలల కట్టుకునే అవకాశంతో కొనుగోలు చేయవచ్చు. 

ఒన్‌ప్లస్‌.ఇన్‌ లేదా ఒన్‌ప్లస్‌ యాప్‌స్టోర్‌ ద్వారా వన్‌ప్లస్‌ 8 ప్రొ కొనుగోలు చేస్తే వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జడ్‌ బేస్‌ ఎడిషన్‌పై 25 శాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. 


వన్‌ప్లస్‌ 8

ఎస్‌బిఐ కార్డు ఉపయోగించుకుంటే దీనిపై రూ.2000 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈంఐ సౌలభ్యం కూడా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ రామ్‌ మోడల్‌ రేటు రూ.39,999. 


వన్‌ప్లస్‌ నోర్డ్‌

వన్‌ప్లస్‌.ఇన్‌, ఆఫ్‌లైన్‌ స్టోర్లు, అమెజాన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులో ఉంది. ఈంఐ సదుపాయానికి తోడు ఎస్‌బిఐ క్రెడిట్‌ కార్డు ఉపయోగిస్తే రూ.1500 డిస్కౌంట్‌ లభిస్తుంది. మార్చి 10 వరకు ఈ ఆఫర్‌ ఉంది. 


వన్‌ప్లస్‌ క్యు1 ప్రొ టీవీ

ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో లభిస్తుంది. దీన్ని కొనుగోలు చేయడం ద్వారా వినియోగదారులు రూ.5000 పొందవచ్చు. అలాగే వన్‌ప్లస్‌ వై సిరీస్‌ 32 ఇంచ్‌ల డిస్‌ప్లే టీవీని ఎస్‌బిఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000, రూ.1500 డిస్కౌంట్‌ లభిస్తుంది. 


ఒన్‌ప్లస్‌ బాండ్‌

దీని రేటు రూ.2,499. దీన్ని కొనుగోలు చేసిన వారికి 50 శాతం రాయతీతో  వన్‌ప్లస్‌ బాండ్‌ స్ట్రాప్స్‌ లభిస్తాయి. వన్‌ప్లస్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌లో ఇది లభ్యమవుతుంది. 


వన్‌ప్లస్‌ బడ్‌ జెడ్‌

వన్‌ప్లస్‌ బడ్స్‌, బడ్స్‌జెడ్‌, వన్‌ప్లస్‌ బిడబ్ల్యుజెడ్‌ బాస్‌ ఎడిషన్‌పై అయిదు శాతం రాయతీ ఫ్లిఫ్‌కార్ట్‌, అమెజాన్‌, వన్‌ప్లస్‌.ఇన్‌లలో లభ్యమవుతుంది. 

వన్‌ప్లస్‌ పవర్‌బ్యాంక్‌ దీని రేటు రూ.1299 కాగా రూ.888 కే లభిస్తుంది. రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. 




Updated Date - 2021-02-13T05:47:33+05:30 IST