ఆకట్టుకుంటున్న నాటిక పోటీలు

ABN , First Publish Date - 2021-11-27T06:22:43+05:30 IST

పట్టణంలో రుత్తల లచ్చాపాత్రుడు, చింతకాయల వరహాలదొర స్మారక రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆకట్టుకుంటు న్నాయి.

ఆకట్టుకుంటున్న నాటిక పోటీలు
ఈ తరం కొడుకులు నాటికలో ఓ సన్నివేశం

నర్సీపట్నం, నవంబరు 26:  పట్టణంలో రుత్తల లచ్చాపాత్రుడు, చింతకాయల వరహాలదొర స్మారక రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఆకట్టుకుంటు న్నాయి. శుక్రవారం సాయత్రం పిఠాపురానికి చెందిన శ్రీమణికంఠ ఆర్ట్స్‌ బృందం ప్రదర్శించిన ‘కొత్తతరం కొడుకులు’ నాటిక పలువుర్ని ఆలోచింపజేసింది. రావు కృష్ణారావు మూల కథను అందించగా, చెలికాని వెంకట్రావు దర్శకత్వం వహించారు. పిల్లల్ని పెంచడం, పోషించడం తల్లి దండ్రుల భాధ్యత.. అదే బాధ్యత తమ పిల్లలకు కూడా ఉంటుందని కొంత మంది తల్లిందండ్రులు విస్మరిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదం డ్రులు సర్దుకుపోయి, తమ పిల్లలతో కలిసి ఉండాలన్ని ఇతివృత్తాన్ని తెలియజేస్తూ నటీనటులు అద్భుతంగా  రక్తికట్టించారు. అనంతరం గుంటూరుకు చెందిన గణేశ్‌ ఆర్ట్స్‌ బృందం ‘అంతా మన మంచికే’ నాటికను వరికోటి ప్రసాద్‌ రచన, దర్శకత్వంలో ప్రదర్శించారు. ఇందులో బి.నాగమణి, డి.రవి, బి.బి.ఆచారి, శివాజీ తదితరులు తమ పాత్రల్లో జీవించారు.

Updated Date - 2021-11-27T06:22:43+05:30 IST