వరి సాగుపై ఆంక్షలు విధించి ఇప్పుడు కొనుగోళ్లా?

ABN , First Publish Date - 2022-05-25T05:20:24+05:30 IST

ఖరీ్‌ఫలో రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని రైతులకు ఆంక్షలు విధించిందని, వరి సాగు చేస్తే ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులు చెప్పడంతో చాలా మంది రైతులు వరి సాగు చేయలేదని కాంగ్రెస్‌ వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, ఎంపీటీసీ ప్రసాద్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరి సాగుపై ఆంక్షలు విధించి ఇప్పుడు కొనుగోళ్లా?
చిన్నశంకరంపేట సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ భాగ్యలక్ష్మి

సాగు చేయని రైతుల పరిస్థితి ఏంటి?

చిన్నశంకరంపేట మండల సర్వసభ్య సమావేశంలో వ్యవసాయాధికారులపై ఆగ్రహం

చిన్నశంకరంపేట, మే 24: ఖరీ్‌ఫలో రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని రైతులకు ఆంక్షలు విధించిందని, వరి సాగు చేస్తే ధాన్యాన్ని కొనుగోలు చేయమని అధికారులు చెప్పడంతో చాలా మంది రైతులు వరి సాగు చేయలేదని కాంగ్రెస్‌ వైస్‌ ఎంపీపీ సత్యనారాయణగౌడ్‌, ఎంపీటీసీ ప్రసాద్‌గౌడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనబోమన్న అధికారులు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారని, వరి సాగు చేయని రైతుల పరిస్థితి ఏంటని వ్యవసాయాధికారులపై మండిపడ్డారు. మంగళవారం ఎంపీపీ ఆవుల భాగ్యలక్ష్మి అధ్యక్షతన ఎంపీడీవో గణే్‌షరెడ్డి మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.

ఫొటోలకు పోజులిస్తున్న అధికారులు

 కొనుగోలు కేంద్రాల వద్ద అధికంగా తూకం వేస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని సభ్యులు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అధికారులు ఫొటోలకు పోజులు ఇవ్వడం తప్పా రైతులకు ఒరగబెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా, నేటికి బిల్లులు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్‌ల ఫోరం మండలాధ్యక్షుడు యాదగిరి యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పలు శాఖల అధికారులు అభివృద్ధి అంశాలను వెళ్లడించారు. ఈసందర్భంగా ఎంపీపీ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి సహకరిస్తానన్నారు. సమావేశంలో మిషన్‌భగీరథ డీఈ శ్రీనివాస్‌, ఇన్‌చార్జి తహసీల్దార్‌ మహేందర్‌గౌడ్‌, ఏవో లక్ష్మీప్రవీణ్‌, పీఆర్‌ఏఈ విజయ్‌, ఏపీవో వెంకటసాయిగౌడ్‌, విద్యుత్‌ ఏఈ సత్యం, ఇరిగేష్‌ ఏఈ నిఖిల, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శివకుమార్‌, విజయలక్ష్మి, అనురాధ, రాణమ్మ, జయమ్మ, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు ఫరీద్‌, సర్పంచ్‌లు సాయిలు, దయానంద్‌, పీఏఈఎస్‌ చైర్మన్‌ అంజిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-25T05:20:24+05:30 IST