Abn logo
Jul 23 2021 @ 00:27AM

కాపులకు పెద్దపీట : నవీన నిశ్చల్‌

హిందూపురం టౌన, జూలై 22: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, తెగల వంటి కులాలను గుర్తించింది ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అని ఆగ్రో్‌స డెవల్‌పమెంట్‌ కార్పొరేషన చైర్మన నవీననిశ్చల్‌ అన్నారు. గురువారం కాపునేస్తం కింద ఆర్థిక సాయాన్ని ఖాతాల్లోకి జమచేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్లమెంట్‌ కార్యాలయం వద్ద జగన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నవీననిశ్చల్‌ మాట్లాడుతూ నవరత్నాల్లో భాగమైన కాపునేస్తాన్ని రెండో ఏడాది విడుదల చేయడం అభినందనీయమన్నారు. కాపులను గుర్తించి వారికి అన్నిరంగాల్లో అవకాశం కల్పించింది జగన్మోహనరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బిసలమానేపల్లి వేణుగోపాల్‌రెడ్డి, నారాయణస్వామి, నరేష్‌, మద్దిపి లక్ష్మీనారాయణ, కాపు మహిళలు  తదితరులు పాల్గొన్నారు.