లేఅవుట్ల అనుమతికి చిక్కులు

ABN , First Publish Date - 2022-01-29T06:59:11+05:30 IST

భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరిలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి.

లేఅవుట్ల అనుమతికి చిక్కులు
భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరి


 టీఎ్‌సబీపా్‌సలో కన్పించని రాయిగిరి రెవెన్యూ గ్రామం 

 భువనగిరి మునిసిపాలిటీలో విలీనంతోనే సమస్య 

 ప్రభుత్వ ఆదాయానికి గండి

ఫ హెచఎండీఏలోకి మార్చాలని కోరుతున్న రైతులు, వ్యాపారులు


యాదాద్రి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని రాయిగిరిలో లేఅవుట్లు ఏర్పాటు చేయాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన టీఎ్‌సబీపాస్‌ ద్వారా 21రోజుల్లోనే లేఅవుట్లను మంజూరు చేస్తోంది. అయితే మునిసిపల్‌, వైటీడీఏ సమన్వయ లోపంతో రాయిగిరి రెవెన్యూ గ్రామంలో ఏదైనా లేఅవుట్‌గానీ, వెంచర్‌ను ఏర్పాటు చేయలేకపోతున్నారు. పలువురు వ్యాపారులు రియల్‌ఎస్టేట్‌ వ్యాపార నిమిత్తం రైతుల వద్ద భూములను కొనుగోలు చేసుకుని, లేఅవుట్లు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఏర్పడింది. నెలల తరబడిగా లేఅవుట్ల అనుమతి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రాష్ట్రంలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేశంలోనే అద్బుత ఆలయంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.1250కోట్లతో ఆలయ పుననిర్మాణం, విస్తరణ, టెంపుల్‌సీటీ, ఆధునిక మౌలిక వసతి గృహాలు, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం పరిసర గ్రామాల్లో  రెండువేల ఎకరాలకు పైగా భూసేకరణ చేసి, ఆధ్యాత్మిక, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పుతోంది. నలుదిక్కులా నాలుగు లేన్ల రహదారులను ఏర్పాటు చేస్తోంది. అయితే దేవాదాయ చట్టం ప్రకారం పట్టణ అభివృద్ది, మౌలిక వనరుల అభివృద్ధికి నిధుల కేటాయింపు, అమలు సాంకేతికంగా అవరోధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ అభివృద్ది కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు కోసం మునిసిపల్‌, పాలనా వ్యవహారాల చట్టం కింద యాదగిరిగుట్ట పట్టణ అభివృద్ధి ప్రాథికార సంస్థ(వైటీడీఏ)ను ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చైర్మనగా, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.కిషనరావు వైస్‌చైర్మన/సీఈవోగా ఈ అథారిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఆలయ విస్తరణ, టెంపుల్‌ టౌన అభివృద్ధికి అవసరమైన స్థలాలను సేకరించిన ప్రాంతాలను కూడా ఆధ్యాత్మికతకు అనుసంధానం చేస్తూ.. ప్రజల వర్తమాన, భవిష్యత అవసరాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి డైర్టెక్టర్‌ ఆఫ్‌ టౌనఅండ్‌ ప్లానింగ్‌తో కలిపి మాస్టర్‌ప్లానను రూపొందించారు.

వైటీడీఏ పరిధిలోని గ్రామాలు ఇవే..

వైటీడీఏ పరిధిలో యాదగిరిగుట్ట మునిసిపాలిటీతో పాటు మల్లాపురం, దాతర్‌పల్లి, సైదాపురం, బస్వాపురం, రాయిగిరి, గంగసానిపల్లి, జమ్మాపురం, వడాయిగూడెం, ముత్తిరెడ్డిగూడెం రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. 2019లో రాయిగిరి, పగిడిపల్లి, బొమ్మాయిపల్లి గ్రామపంచాయతీలను భువనగిరి మునిసిపాలిటీలో ప్రభుత్వం విలీనం చేసింది. భువనగిరి మండలంలోని రాయిగిరి గ్రామపంచాయతీ వైటీడీఏ పరిధిలోకి వస్తుంది. భువనగిరి మండలంలోని అన్ని గ్రామాలు కూడా హెచఎండీఏ పరిధిలో ఉంటాయి. అయితే వైటీడీఏ పరిధిలో ఉన్నటువంటి రాయిగిరిని హెచఎండీఏ పరిధిలోకి వచ్చే భువనగిరి మునిసిపాలిటీలో విలీనం చేయడంతో లేఅవుట్ల అనుమతితో పాటు ఇళ్ల నిర్మాణ అనుమతులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భువనగిరి మునిసిపాలిటీలో విలీనం చేసే ముందు రాయిగిరిని వైటీడీఏ నుంచి హెచఎండీఏ పరిధిలోకి మార్చాల్సి ఉండేది. ఈ ప్రక్రియను మునిసిపల్‌ శాఖ చేపట్టకపోవడంతో రాయిగిరి రెవెన్యూ గ్రామం భువనగిరి మునిసిపాలిటీలో విలీనం అయినప్పటికీ వైటీడీఏ పరిధిలోనే ఉన్నట్టుగా ఆనలైనలో చూపిస్తోంది. అయితే ఈ రెవెన్యూ గ్రామపంచాయతీకి లేఅవుట్లు, ఇళ్ల ఇళ్ల నిర్మాణ అనుమతులు టీఎ్‌సబీపాఎస్‌ ద్వారా భువనగిరి మునిసిపాలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సాంకేతిక సమస్యతో దాదాపుగా 15మంది రైతులు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫ్‌లైనలో/మాన్యువల్‌గా తమ లేఅవుట్లను ఆమోదించాలని కోరుతున్నారు. రాయిగిరి రెవెన్యూ గ్రామాన్ని హెచఏండీఏ పరిధిలోకి తీసుకొచ్చి, తమకు అనుమతి ఇవ్వాలని మునిసిపాల్‌ పరిపాలనా, డైరెక్టర్‌ టౌన, కంట్రీ ప్లానింగ్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలువురు వ్యాపారులు డీటీసీపీ డైరెక్టర్‌కు వినతిపత్రం కూడా అందజేశారు. భువనగిరి, యాదగిరిగుట్ట మునిసిపాలిటీల మధ్య ఉన్నటువంటి రెవెన్యూ గ్రామాల పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఊపందుకుంది. చిన్నచిన్న సమస్యల వల్ల రాయిగిరిలో కొత్త వెంచర్లు ఏర్పాటు చేయలేకపోతున్నామని పలువురు వ్యాపారులు వాపోతున్నారు. సకాలంలో లేఅవుట్‌ అనుమతి రాకపోవడంతో ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే ఈ సమస్య తీర్చాలని రైతులు కోరుతున్నారు. 

టీఎ్‌సబీపా్‌సలో లేఅవుట్లు మంజూరు కావడంలేదు

భువనగిరి మండలం రాయిగిరి రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 573,576,602/పీలో మాకు ఐదు ఎకరాల భూమి ఉంది. తమ పొలంలో లేఅవుట్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎ్‌సబీపా్‌సలో దరఖాస్తు చేసుకుంటే అప్‌లోడ్‌ కావడంలేదు. రాయిగిరి వైటీడీఏ పరిధిలో ఉన్నట్టుగా ఆనలైనలో కన్పిస్తోందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ సాంకేతిక కారణంలో అధికారులు లేఅవుట్‌కు అనుమతి ఇవ్వడంలేదు. ఈ సమస్యను మునిసిపల్‌, డీటీసీపీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్ర భుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరాం. వీలైనంత త్వర గా లేఅవుట్‌ను అనుమతిస్తే ఆర్థికపరమైన చిక్కుల నుంచి అధిగమిస్తాం. 

- పసుపునూరి పావని, వ్యాపారి


Updated Date - 2022-01-29T06:59:11+05:30 IST