రాష్ట్రాభివృద్ధికి వినూత్న పథకాల అమలు

ABN , First Publish Date - 2021-06-18T04:15:07+05:30 IST

రాష్ట్రాభివృద్ధికి వినూత్న పథకాల అమలు

రాష్ట్రాభివృద్ధికి వినూత్న పథకాల అమలు
ఆమనగల్లు : చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్సీ

  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి


ఆమనగల్లు/తలకొండపల్లి: రాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం వినూత్న పథకాలు రూపొందించి అమలు చేస్తోందని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కడ్తాల మండలం చరికొండకు చెందిన అలివేలుకు రూ.27వేలు, కల్వకుర్తికి చెందిన సుమల్యకు రూ.60 వేలు, డి.యాదయ్యకు రూ.44వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. గురువారం నగరంలోని తన నివాసం లో బాధిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, రంగయ్య, రామచంద్రయ్యగౌడ్‌, రమేశ్‌, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండల పరిధి వెంకట్రావ్‌పేట తండాకు చెందిన ంజి కి రూ.లక్ష, పెద్దూర్‌ తండాకు చెందిన ప్రవీణ్‌ కు రూ.12వేలు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరయ్యాయి. మండల కేంద్రంలో బాధిత కుటుంబాలకు ఎమ్మె ల్యే జైపాల్‌యాదవ్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌ యాదవ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ముజుబుర్‌ రెహమాన్‌, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్‌ దశర్‌థనాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

సీఎం సహాయనిధి పేదలకు వరం

షాబాద్‌:  సీఎం సహాయనిధి పేదలకు వరం అని జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి అన్నారు. గురువారం చర్లగూడకు చెందిన జంగమ్మకు రూ.60వేలు, షాహీద్‌కు రూ.32వేల సీఎం రిలీ్‌ఫఫండ్‌ చెక్కులు అందజేశారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింగ్‌రావ్‌, మండల రైతు సమితి కన్వీనర్‌ మధూసూదన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సుదర్శన్‌, రాజు, రాంచంద్రారెడ్డి, ఇనాయత్‌, వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T04:15:07+05:30 IST