మండల్‌ సిఫార్సులను అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-08-08T08:12:36+05:30 IST

ఓబీసీల సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బీపీ మండల్‌ చేసిన 42 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు.

మండల్‌ సిఫార్సులను అమలు చేయాలి

గుంటూరు, ఆగస్టు 7: ఓబీసీల సామాజిక స్థితిగతులు మెరుగుపరిచేందుకు బీపీ మండల్‌ చేసిన 42 సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. శుక్రవారం మండల్‌ డేను పురస్కరించుకుని గుంటూరులో పూలే విగ్రహం,  మాజీ ప్రధాని వీపీ సింగ్‌, బీపీ మండల్‌ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు.


ఈ సందర్భంగా కేసన మాట్లాడుతూ  సిఫార్సులను  తక్షణమే అమలు చేయకుంటే త్వరలో పార్లమెంటు ముట్టడి తప్పదన్నారు. ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ రెండు సిఫార్సులను మాత్రం అమలు చేసి మిగతావి తొక్కిపెట్టారన్నారు. చాయ్‌వాలా, బీసీని అని చెప్పుకునే ప్రధాని నరేంద్రమోదీ బీసీల సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో యూత్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్‌, నాయకులు కన్నా మాష్టారు, ధూళిపాళ్ళ ఏసుబాబు, జూపూడి శ్రీనివాసరావు, అంగిరేకుల గోపికృష్ణ, కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, మాల్యాద్రి తదితరులున్నారు. 

Updated Date - 2020-08-08T08:12:36+05:30 IST