లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేయండి

ABN , First Publish Date - 2020-03-27T09:03:26+05:30 IST

లాక్‌డౌన్‌ను మరో మూడు వారాలపాటు పటిష్ఠంగా అమలు చేయాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో...

లాక్‌డౌన్‌ పటిష్ఠంగా అమలు చేయండి

  • నిత్యావసరాలకు ఆటంకం కలగకూడదు  : కేంద్రం

అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను మరో మూడు వారాలపాటు పటిష్ఠంగా అమలు చేయాలని కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబ ఆదేశించారు. గురువారం ఆయన ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ అమలవుతున్న తీరును వివిధ రాష్ట్రాల సీఎ్‌సలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసరాల సరఫరాలో ఎక్కడా అటంకం కలగకుండా చూడాలన్నారు. వైద్య పరికరాలు, మందుల వాహనాలకు అటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. రైతుబజార్లు, కిరాణా దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని పాటించేలా చూడాలన్నారు. లాక్‌డౌన్‌తో చిక్కుకున్న వేరే రాష్ట్రాలకు చెందిన కార్మికులు, విద్యార్థులు, కూలీలకు ఆయా రాష్ట్రాలు తగిన వసతి కల్పించాలన్నారు. ఏపీ సీఎస్‌ నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో డీజీపీ గౌతం సవాంగ్‌, ఆర్‌అండ్‌బీ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-27T09:03:26+05:30 IST