Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల్లో రోగనిరోధకశక్తి ఎక్కువే

ఆంధ్రజ్యోతి(19-06-2021)

కొవిడ్‌ సమయంలో యువత, పెద్దలు అధికంగా వ్యాధి ప్రభావానికి గురయ్యారు. అయితే పిల్లలు మాత్రం పెద్దవారితో పోలిస్తే సేఫ్‌. ఇందుకు కారణం పిల్లల్లోని అద్భుతమైన వ్యాధినిరోధకశక్తి కారణమని నిపుణులు అంటున్నారు.


పిల్లల్లోకి వైరస్‌ వెళ్తూనే వారిలోని రోగనిరోధకశక్తి అధికంగా ఉండటం వల్ల వెంటనే తెల్లరక్తకణాలు ఆ వైర్‌సను అంతమొందిస్తున్నాయి. ఇలా వేగంగా స్పందించే గుణముండటం వల్లనే పిల్లలు వ్యాధిబారిన పడలేదు. పిల్లల్లోని టీ సెల్స్‌ స్పందించే విధానం వల్ల కొవిడ్‌ వైరస్‌ ఆటలు సాగలేదు అంటున్నారు వైరాలజిస్టులు. ఆస్ర్టేలియాలో ముర్దోక్‌ చిల్డ్రన్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చేసిన ఓ సర్వే ఇటీవలే వచ్చింది.


పిల్లల్లోని వ్యాధినిరోధకశక్తి ఎక్కువగా ఉండటం వల్ల కరోనా వైరస్‌ బారినపడలేదు. ఒకవేళ పడినా తొందరగా కోలుకున్నారు. పిల్లలు, పెద్దల రక్తాన్ని తీసుకుని పరిశోధన చేస్తే పిల్లల నిరోధకశక్తి ఎక్కువ ఉండడానికి కారణం వారిలోని ప్రత్యేకమైన తెల్లరక్తకణాలే కారణం. న్యూట్రోఫిల్స్‌తో పాటు మోనోసైట్స్‌ లాంటివి సహజంగా ఉండటం వల్ల కరోనా వైర్‌సతో పోరాడి గెలిచాయి. అందుకే  పెద్దలతో పోలిస్తే పిల్లల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువే అని నిపుణులు అంటున్నారు. 

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...