ఇమ్యూనిటీ డ్రింక్‌

ABN , First Publish Date - 2021-06-05T05:14:38+05:30 IST

గత ఏడాదితో పోలిస్తే రెండో దశలో కరోనా మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోంది.

ఇమ్యూనిటీ డ్రింక్‌

గత ఏడాదితో పోలిస్తే రెండో దశలో కరోనా మరింత ప్రమాదకరంగా విజృంభిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యవసరం. బలమైన రోగనిరోధక వ్యవస్థతోనే ఇది సాధ్యం. అందుకు ఈ పానీయం ఔషధంలా పనిచేస్తుంది. 


మీరూ ప్రయత్నించండి...  

అల్లం, తిప్పతీగతో... 

కావల్సినవి: ఆరేడు తులసి ఆకులు, అయిదు లవంగాలు, టేబుల్‌ స్పూన్‌ తురిమిన అల్లం, కప్పు జిలోయ్‌ (తిప్పతీగ) జ్యూస్‌, రెండు టేబుల్‌ స్పూన్ల నిమ్మ రసం, బ్లాక్‌ సాల్ట్‌. 


తయారీ: స్టవ్‌పై గిన్నె పెట్టి అందులో కప్పు నీళ్లు పోయాలి. తులసి ఆకులు, లవంగాలు, అల్లం వేసి అయిదు నిమిషాలపాటు మరగనివ్వాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టి, గాజు బాటిల్‌లో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం ఒక టేబుల్‌ స్పూన్‌, నిమ్మరసం, కొద్దిగా బ్లాక్‌ సాల్ట్‌లను కప్పు జిలోయ్‌ జ్యూస్‌లో వేసి, బాగా కలపండి. ప్రతిరోజూ ఉదయం ఈ పానీయాన్ని తీసుకోండి. 


ప్రయోజనం: జిలోయ్‌లో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగకారకాలైన ఫ్రీరాడికల్స్‌తో పోరాడడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. అంతేకాదు... శరీరంలోని విషకారకాలను తొలగించి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి. లివర్‌, యూరినరీ ఇన్‌ఫెక్షన్లను నియంత్రిస్తాయి. ఇక తులసి, అల్లం, లవంగాల్లోని యాంటీమైక్రోబయల్‌, యాంటీబయోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగాల నుంచి రక్షిస్తాయి. జిలోయ్‌తో వీటిని కలిపి తీసుకోవడంవల్ల రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Updated Date - 2021-06-05T05:14:38+05:30 IST