ఇమ్యూన్‌ బూస్టింగ్‌ సూప్‌

ABN , First Publish Date - 2020-03-07T17:41:34+05:30 IST

కొబ్బరి నూనె - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పుట్టగొడుగులు - అరకేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి

ఇమ్యూన్‌ బూస్టింగ్‌ సూప్‌

కావలసినవి: కొబ్బరి నూనె - ఒక టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, పుట్టగొడుగులు - అరకేజీ, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, పసుపు - చిటికెడు.


తయారీ:

* పుట్టగొడుగులను కట్‌ చేయాలి. 

* పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి       వేగించాలి.

* వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మరికాసేపు వేగనివ్వాలి.

* పుట్టగొడుగులు వేసి పదినిమిషాల పాటు ఫ్రై చేయాలి.

* తరువాత కొద్దిగా నీళ్లుపోసి ఉడికించాలి. మిరియాల పొడి     చల్లుకుని దింపుకోవాలి.

* ఈ సూప్‌ను వేడివేడిగా సర్వ్‌ చేసుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకుని   తరువాత కూడా సర్వ్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2020-03-07T17:41:34+05:30 IST