ఇమ్యూనిటీని పెంచే లిచి

ABN , First Publish Date - 2022-09-21T18:37:18+05:30 IST

చూడటానికి అందంగా, రఫ్‌ టెక్చర్‌, రుచిగా ఉండే లిచి పండ్లకు చైనా ప్రసిద్ధి. పదకొండో శతాబ్ధంనుంచే వీటి సాగు ఉంది. చైనాలోని

ఇమ్యూనిటీని పెంచే లిచి

చూడటానికి అందంగా, రఫ్‌ టెక్చర్‌, రుచిగా ఉండే లిచి పండ్లకు చైనా ప్రసిద్ధి. పదకొండో శతాబ్ధంనుంచే వీటి సాగు ఉంది.  చైనాలోని గుయాంగ్‌ డంగ్‌, ఫుజియాన్‌, యునాన్‌ ప్రాంతాల్లోనే కాకుండా వియత్నాం, కంబోడియాలో పండుతాయివి. లిచీలను జ్యూస్‌, ఐస్‌క్రీమ్స్‌, కేక్స్‌తో పాటు పలురకాల డెజర్ట్స్‌లో కూడా వాడతారు. ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయివి. 


  • లిచీ పండులో నీరు 70 శాతం ఉంటుంది. ఒక పండు తింటే 66 కేలరీలు వస్తాయి. వీటిలో న్యూట్రిన్లు అధికంగా ఉంటాయి. రక్తప్రసరణ సాఫీగా జరగటానికి, రక్తనాళాల ఆరోగ్యానికి ఇవి మంచివని పరిశోధకులు చెబుతున్నారు. 
  • ఇవి సులువుగా జీర్ణమవుతాయి.
  • బరువు తగ్గటానికి డైట్‌లో తీసుకుంటారు. గుండె ఆరోగ్యానికి మంచిది.
  • లిచీలు తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో పాటు ఇవి యాంటీ వైరల్స్‌గా పని చేస్తాయి. బ్యాక్టీరియాని తరిమికొట్టే గుణం కూడా వీటికి ఉంది. 
  • ఇందులో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇవి తింటే ఒత్తిడి తగ్గిపోయే అవకాశం ఉంది.
  • కళ్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఎముకల పటుత్వాన్ని బాగా పెంచుతుంది.
  • థైరాయిడ్‌ సమస్యలు తగ్గిపోతాయి. మెదడు చురుగ్గా పని చేస్తుంది.
  • విటమిన్‌ సి పుష్కలం కాబట్టి ప్రతిరోజు రెండు, మూడు లిచీ పండ్లను తింటే మంచిది. ప్రెగ్నెంట్స్‌ తినకూడదు. అయితే డయాబెటిస్‌తో బాధపడే వాళ్లూ ఈ పండ్లను తినొచ్చు.
  • క్యాన్సర్‌ కణాలను రాకుండా చేసే గుణం వీటికి ఉంది.
  • లిచీ పండ్లను తరచుగా తింటుంటే చర్మ ఆరోగ్యం మెరుగవుతుంది.

Updated Date - 2022-09-21T18:37:18+05:30 IST