కైరిగూడ- ఆగర్గూర్వాడ గ్రామాల మధ్య ప్రమాదకరంగా ఉన్న గుంత
కెరమెరి, జనవరి 23: కెరమెరి-ఇందాపూర్ ప్రధాన రహదారిపై కైరిగూడ- ఆగర్గూర్వాడ గ్రామాల మధ్య కల్వర్టువద్ద పెద్దగుంత ఏర్పడి ప్రమాద కరంగా మారింది. ఈ మార్గం గుండా ప్రజలు నిత్యం రాక పోకలు సాగి స్తుంటారు. ఆదివారం కెరమెరి మండల కేంద్రంలో వారసంత కావడంతో నిత్యావసర సరుకులు ఇతర పనుల నిమిత్తం పెద్ద సంఖ్యలో ప్రజలు రాక పోకలు సాగిస్తారు. అదమరిస్తే అందులో బాటసారులు అందులో పడే ప్రమాదం ఉందని, ముఖ్యంగా రాత్రి సమయాల్లో గుంత పడక ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని సంతకు వచ్చిన ప్రజలు వాపోతు న్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని వారు కోరుతున్నారు.